సాయిపల్లివి…సౌత్ ఇండియన్(South indian) సినీ మెలోడీకి అనుపల్లవి. సినీ గ్లామర్ కన్నా, సినిమా గ్రామర్ నేర్చుకున్న యంగ్ హీరోయిన్. 2005లో చైల్డ్ ఆర్టిస్ట్( child artist )గా కెరీర్ ప్రారంభించింది.
ప్రస్తుతం హీరోయిన్ గా కనస్ట్రక్టీవ్ సినీ కెరీర్ లీడ్ చేస్తోంది. ఆమె తెలుగు సినిమా చేస్తే తెలుగింటి అమ్మాయి అయిపోతుంది. మళయాళంలో చేస్తే మలయాళ కుట్టి, మాతృభాష తమిళ్ కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు.
భాషలోనే కాదు పాత్రలో కూడా ఆమె అలాగే ఒదిగిపోతుంది. చాలా రోజులుగా సినిమాలకు సెలవిచ్చిన సాయిపల్లవి ప్రస్తుతం కోలీవుడ్(kolly wood) లో భామ శివ కార్తికేయన్(Siva karthikeyan) సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మధ్య సాయి పల్లవి మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి.
ఆమె సినిమాలు చేయడం మానేసిందని, హాస్పిటల్ పెడుతుందని.. పెళ్లి చేసుకుంటుందని ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఇవేమి నిజం కాదని సాయి పల్లవి తేల్చి చెప్పేసింది.
మంచి కథలను ఎంచుకోవడానికి టైమ్ తీసుకుంటున్నానని చెబుతోంది. కేవలం గ్లామర్ కి, సాంగ్స్ కు పరిమితమయ్యే సినిమాలను కానీ ఒప్పుకోకుండా తనకు గుర్తింపు తెచ్చే పాత్రలను చేస్తూ మెప్పిస్తుంది.
ఇక అప్పుడప్పుడు ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఇటీవలే సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరీర్ గురించి, భవిష్యత్ గురించి చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా తనకున్న ఒక వింత అలవాటును కూడా తెలిపింది. సాయి పల్లవికి చిన్నతనం నుంచి విభూతి(vibhuti)తినడం అలవాటని తెలిపింది.” చిన్నతనం నుంచి నాకు విభూతి తినడం ఇష్టం.
ఇప్పటికి తింటాను. ఏదైనా ప్రదేశానికి వెళ్ళేటప్పుడు విభూతిని కూడా తీసుకెళ్తాను. నా బ్యాగ్ లో ఎప్పుడు విభూతి ఉంటుంది. ఒక మంచి చెట్టు నుంచి వచ్చిన విభూతి తినడం ఆరోగ్యానికి మంచిది” అని తెలిపింది.
సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు, స్వామిజీలను కలిసినప్పుడు విభూతి తినమని చెప్తూ ఉంటారు. కానీ, సాయి పల్లవి మాత్రం ఇలా నిత్యం విభూతి తినడం వింతగా ఉందే..!?
అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.అదేం వింత అలవాటు పాప అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి సాయి పల్లవి త్వరలో తెలుగు సినిమా ఏదైనా ఒప్పుకుంటుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.