Telugu News » Daggubati Purandeswari: రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తి కనిపించడంలేదు: పురంధేశ్వరి

Daggubati Purandeswari: రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తి కనిపించడంలేదు: పురంధేశ్వరి

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు.

by Mano
Daggubati Purandeswari: Constitutional spirit is not visible in the state: Purandeswari

వైసీపీ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి కనిపించడంలేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు(BJP AP Chief) దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Daggubati Purandeswari: Constitutional spirit is not visible in the state: Purandeswari

ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకోవాలన్నారు. అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకోవాలని, ప్రధాని నరేంద్రమోదీ అంత్యోదయ స్ఫూర్తిగా అడుగులు వేస్తున్నారన్నారు. దేశసేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన తరుణమిదని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో వాక్ స్వాతంత్ర్యం అనేది రాష్ట్రంలో ఎవరికీ లేకుండా పోయిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే జైలుకు పంపుతున్నారని, అవినీతిని ప్రశ్నిస్తే భయపెట్టి నిర్భందాలు, వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తి లేదని, సమసమాజ స్థాపన భావన ఏమాత్రం కనిపించడంలేదన్నారు.

ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి తిలోకదకాలిచ్చారన్నారని విమర్శించారు. పద్మ అవార్డు గ్రహీతలకు, వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఉమామహేశ్వరిలకు పురందేశ్వరి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగంలోని సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం రాష్ట్రంలో కొరవడ్డాయన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని.. ప్రజలను గాలికొదిలేశారని విమర్శించారు.

You may also like

Leave a Comment