ఒకవైపు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) నేతలు పొయ్యిలో ఉప్పులా చిటపటలాడుతూ తీవ్రంగా విమర్శించుకోంటుండగా.. మరోవైపు సికింద్రాబాద్ (Secunderabad) కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ (Danam Nagender) అణుబాంబ్ లాంటి వార్తను వెల్లడించారు.. నేటి సాయంత్రం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు..

మరోవైపు కేటీఆర్ బీజేపీతో కలుస్తున్నామని తనతో అన్నట్లు పేర్కొన్నారు.. అది నాకు నచ్చక బీజేపీతో కలవడం ఏంటని ప్రశ్నించినట్లు తెలిపారు. కానీ, ఆల్రేడీ నిర్ణయం తీసుకొన్నామని వెల్లడించినట్లు తెలిపారు.. ఈమేరకు నేను పార్టీ వీడటానికి అదొక కారణంగా దానం వెల్లడించడం సంచలనంగా మారింది. ఇక పార్టీల ఫిరాయింపుపై మండిపడుతున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. అసలు ఈ విధానాన్ని మొదట అమలుచేసింది ఎవరో తెలుసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ అనుకున్నా.. కానీ విలువలు లేకుండా అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుందని అందరూ అనుకొంటున్నట్లు దానం నాగేందర్ తెలిపారు.. అయితే కేసీఆర్ (KCR) గొప్ప నాయకుడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని ఆయన అన్నారు.. రాజకీయంగా అవకాశాలు కల్పించిన కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు..