Telugu News » Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైకోర్టు.. నోటీసులు జారీ..!

Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైకోర్టు.. నోటీసులు జారీ..!

దానం నాగేందర్ ఎన్నికను సవాలు చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇదివరకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి విజయ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

by Venu

అధికారం ఏ పార్టీ చేతులో ఉంటే నేతల చూపులు కూడా అటువైపే అని రాజకీయాల్లో ఎన్నో సార్లు నిరూపించబడింది. తాజాగా బీఆర్ఎస్ (BRS) ఓటమి.. కాంగ్రెస్ (Congress) విజయం సైతం ఈ విషయాన్ని బిగ్ స్క్రీన్ లో చూపిస్తోంది. ఒకప్పుడు బీఆర్ఎస్ ఖాళీ లేకుండా ఎలా నిండిపోయిందో.. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా వలస నేతలతో కిటకిటలాడుతోందని తెలుస్తోంది.

ఈ క్రమంలో కారు దిగి హస్తాన్ని అందుకొన్న నేతల్లో ఖైరతాబాద్ (Khairatabad) ఎమ్మెల్యే (MLA) దానం నాగేందర్ ఒకరు.. తాజాగా కాంగ్రెస్ ఆయనను సికింద్రాబాద్ పారమెంట్ నుంచి ఎంపీ ఎన్నికల్లో బరిలో నిలిపింది. అయితే దానం నాగేందర్ ఎన్నికను సవాలు చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇదివరకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి విజయ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. మరోవైపు దానం నాగేందర్ (Danam Nagender)ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఎన్నికల సమయంలో డబ్బులు పంచిపెట్టి అనైతికంగా గెలిచారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు అయ్యాయని విజయ రెడ్డి (Vijaya Reddy) పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఇది పూర్తిగా వ్యతిరేకం అని ఆమె వాదించారు. కాగా

అదేవిధంగా దానం నాగేందర్ తన భార్యకు సంబంధించిన ఆస్తి వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొన లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే నెల 18 వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా విజయారెడ్డి బరిలో ఉన్నారు..

You may also like

Leave a Comment