Telugu News » India-Maldives : చైనాతో దోస్తీ… భారత్ -మాల్దీవుల మధ్య క్షీణిస్తున్న సంబంధాలు…!

India-Maldives : చైనాతో దోస్తీ… భారత్ -మాల్దీవుల మధ్య క్షీణిస్తున్న సంబంధాలు…!

ఇటీవల ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం విషయంలో వివాదం మొదలైంది. ఆ వివాదం ముదిరి ఇప్పుడు ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతోంది.

by Ramu
declining diplomatic relations between india and maldives

మాల్దీవుల (maldives)నూతన అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్జు అధికారం చేపట్టి నుంచి భారత్ (India)-మాల్దీవుల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. ఇటీవల ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం విషయంలో వివాదం మొదలైంది. ఆ వివాదం ముదిరి ఇప్పుడు ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతోంది. దశాబ్దాల స్నేహాన్ని మరిచి మాల్దీవులు భారత్‌కు దూరం అవుతోంది.

declining diplomatic relations between india and maldives

1965లో వలస పాలన నుంచి విముక్తి పొంది మాల్దీవులు స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఆ సమయంలో మాల్దీవులను ఓ స్వతంత్ర దేశంగా గుర్తించి భారత్ స్నేహ హస్తం అందించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య స్నేహం బల పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 1980లో మాల్దీవుల్లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడ్డాయి.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా 2011లో చైనా ఎంట్రీతో సీన్ మారింది. 2011లో మాల్దీవుల్లో దౌత్య కేంద్రాన్ని ప్రారంభించిన చైనా నెమ్మదిగా ఆ దేశంతో స్నేహం మొదలు పెట్టింది. అప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా భారత్ ను పక్కన పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2013లో మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ అధికారం చేపట్టారు. ఆ తర్వాత అబ్దుల్లా హమీన్ చైనాకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు.

మాల్దీవుల అభివృద్ధికి సహకారం అందిస్తామంటూ చెప్పిన డ్రాగన్ కంట్రీ ఆ దేశానికి భారీగా రుణాలను ఇచ్చింది. ముందు వెనకా ఆలోచించని మాల్దీవులు ఆ దేశ జీడీపీలో 30శాతానికి సమానమైన మొత్తంలో అప్పులు చేసింది. దీంతో రుణభారం పెరిగిపోయింది. దీంతో అధ్యక్షుడి తీరుపై నిరసనలు మొదలయ్యాయి. చైనా స్పూర్తితో కూడిన విధానాన్ని తిరస్కరించాలంటూ డిమాండ్లు పెరిగాయి.

ఇక చైనా విధానాలను భారత్ నిశితంగా గమనిస్తూ వస్తోంది. మాల్దీవులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తూ వచ్చింది. ఆ దేశానికి సైనిక సహాయం, శిక్షణను అందజేసింది. ఆ దేశంలో భారీగా పెట్టుబడులు కూడా పెట్టింది. ఆ దేశంలో సుమారు 25,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. గతేడాది నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ మొయిజ్జు పదవీ చేపట్టాక భారత్‌తో ఆ దేశ సంబంధాలు దెబ్బతింటున్నాయి.

You may also like

Leave a Comment