Telugu News » Delhi : కల్లోలంలో ఢిల్లీ రాజకీయం.. ఆప్​కు బిగ్ షాక్ ఇచ్చిన ​మంత్రి..!

Delhi : కల్లోలంలో ఢిల్లీ రాజకీయం.. ఆప్​కు బిగ్ షాక్ ఇచ్చిన ​మంత్రి..!

అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని తెలిపిన ఆనంద్.. పార్టీలో దళితులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు.

by Venu
Arvind Kejriwal: CM Dumma for ED investigation for the seventh time..!

ఆమ్‌ ఆద్మీ (Aam Aadmi) పార్టీకి లోక్‌సభ ఎన్నికల ముందు వరుసగా షాక్ లు తగులుతున్నాయి.. ఇప్పటికే క్రేజీవాల్ (Kejriwal) అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అలాగే పార్టీపై పలు ఆరోపణలు వస్తున్నాయి.. ఇదే సమయంలో మరో దెబ్బతగిలింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ (Raaj Kumar) తన పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆ వర్గంలో మోసపోయామనే భావన ఉందని, అందుకే పార్టీలో కొనసాగకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని తెలిపిన ఆనంద్.. పార్టీలో దళితులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. అలాగే రాజకీయాలు మారలేదు కానీ రాజకీయ నేత మారారని ధ్వజమెత్తారు..

పార్టీలో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందన్నారు.. మంత్రిగా కొనసాగటం కష్టంగా ఉందని పేర్కొన్నారు. నా పేరుపై అవినీతి మచ్చ పడకూడదని భావించడం వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.. మరోవైపు నిన్నటి వరకు ఇదంతా కుట్రగా భావిస్తున్నట్లు తెలిపిన ఆనంద్.. ఢిల్లీ (Delhi) హైకోర్టు తీర్పు తర్వాత ఇందులో నిజంగా మోసం ఉందని గ్రహించినట్లు వివరించారు..

మరోవైపు రాజ్​కుమార్ రాజీనామాపై మంత్రి, ఆప్​ నేత సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఆనంద్​ రాజీనామా చేసినందుకు మేమందరం ఆయన్ని ద్వేషించడం లేదన్నారు.. అలాగే నిజాయితీ లేని వాడని, మోసగాడని భావిస్తామని అనుకుంటున్నారు.. కానీ అలాంటివేవి మేము అనుకోవడం లేదని తెలిపారు.. కానీ ఈడీ బెదిరింపులకు భయపడి ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని భావిస్తున్నట్లు పేర్కొన్నా

You may also like

Leave a Comment