Telugu News » Delhi Liquor Scam : ఇప్పట్లో బెయిల్ కష్టమే.. కవితపై కీలక సాక్ష్యాలు ప్రవేశ పెట్టిన ఈడీ..!

Delhi Liquor Scam : ఇప్పట్లో బెయిల్ కష్టమే.. కవితపై కీలక సాక్ష్యాలు ప్రవేశ పెట్టిన ఈడీ..!

ఈడీ తరపున జోయాబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు.. లిక్కర్ కేసులో ఎవరి పాత్ర ఎంటి అనేది తెలిపారు. కవిత ప్రస్తావన పై కోర్టుకు వివరించారు. లైసెన్స్, మార్జిన్ ఫీజు పెంచడంలో ఎటువంటి లాజికల్ కంక్లూజన్ లేదని పేర్కొన్నారు.

by Venu
Delhi-Liquor-Scam

ఢిల్లీ (Delhi) లిక్కర్‌ స్కామ్‌ (Liquor Scam) కేసులో కవిత (Kavitha)ది కీలక పాత్ర అని రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ (CBI) బలమైన వాదనలను వినిపిస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు ఈడీ (ED) సైతం ఇదే కోణంలో తమ వాదనలు వినిపిస్తోంది. తాజాగా కవిత బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు మే 6 కు రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి కావేరి బవేజ ప్రకటించారు..

Will come out like a washed pearl.. Judgment reserved on Kavitha's bail petitionఇక ఈడీ తరపున జోయాబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు.. లిక్కర్ కేసులో ఎవరి పాత్ర ఎంటి అనేది తెలిపారు. కవిత ప్రస్తావన పై కోర్టుకు వివరించారు. లైసెన్స్, మార్జిన్ ఫీజు పెంచడంలో ఎటువంటి లాజికల్ కంక్లూజన్ లేదని పేర్కొన్నారు. నూతన మద్యం పాలసీలో 5 శాతం మార్జిన్ నుంచి 12 శాతానికి పెంచారని వివరించారు. పెంచిన లాభాన్ని తిరిగి వెనక్కి పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు..

మరోవైపు కేజ్రీవాల్ సౌత్ గ్రూప్ ల మధ్య విజయ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారని.. అలాగే ఈ కొత్త పాలసీ కొందరికి మేలు జరిగేలా తయారు చేశారని జోయాబ్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు.. పాత పాలసీ ని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చినట్లు ఆరోపించారు.. లిక్కర్ స్కాం, వ్యాపారంలో ఇండో స్పిరిట్ చాలా కీలకంగా ఉందన్నారు.. సుప్రీం కోర్టులో కూడా లిక్కర్ కేసులో ఉన్న వాళ్లకు బెయిల్ లభించలేదన్నారు..

అలాగే లిక్కర్ వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటేరియట్ లో కేజ్రివాల్ ను మాగుంట శ్రీనివాసులు కలిశారని తెలిపిన ఈడీ తరపున న్యాయవాది.. కేజ్రీవాల్ సూచన మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కల్వకుంట్ల కవితను కలిశారన్నారు.. ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ భాగస్వామ్యం కోసం ఆప్ కు 100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు వివరించారు.. అలాగే కవిత 100 కోట్ల రూపాయలు మాగుంటను అడిగారని పేర్కొన్నారు..

బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సప్ చాట్స్ లో సాక్ష్యాధారాలు దొరికాయని పేర్కొన్నారు. కోర్టు అనుమతి తోనే నిందితులు అప్రూవర్లుగా మారారన్నారు. అలాగే లిక్కర్ కేసులో లేనని, లిక్కర్ పాలసీ రూపకల్పన తెలియదని బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చారు.. కవిత తన ఫోన్లలో డేటాను డిలీట్ చేశారు. 10 ఫోన్లు ఇచ్చారు, ఇచ్చిన ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చారని న్యాయవాది అన్నారు.. ఎందుకు డిలీట్ చేసారని కవితను అడిగితే సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. మరోవైపు ఎల్లుండి లిఖితపూర్వకంగా తమ రిజాయిండర్ ఇస్తామని కవిత తరపు న్యాయవాది నితీష్ రానా కోర్టుకు తెలిపారు..

You may also like

Leave a Comment