ఢిల్లీ (Delhi) మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది.. తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎంట్రీ ఇచ్చింది. ఆమెను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించాల్సిన అవసరముందని అందులో పేర్కొంది.

అదీగాక విచారణలో నిబంధనలు పాటించాలని సూచించింది. మరోవైపు కవిత స్టేట్మెంట్ను సీబీఐ రికార్డ్ చేయనుంది. అనంతరం కొంత సమాచారం రాబట్టిన తర్వాత మరో ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 15న ఆమెను అదుపులోకి తీసుకుని కొన్ని రోజుల పాటు విచారించారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
మరోవైపు ఇదే కేసులో మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అదేవిధంగా లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతేడాది నుంచి తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం వీరందరి బెయిల్ పెండింగ్ లో ఉన్నాయి..