Telugu News » Delhi liquor Scam : కవిత బెయిల్‌ విషయంలో కీలక అంశాలు.. జోరుగా సాగిన వాదనలు..!

Delhi liquor Scam : కవిత బెయిల్‌ విషయంలో కీలక అంశాలు.. జోరుగా సాగిన వాదనలు..!

అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదని పేర్కొన్నారు.. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు వివరించారు.. అలాగే ఈడీ కస్టడీలో ఉన్నవేళ సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందన్నారు.

by Venu
Delhi-Liquor-Scam

ఢిల్లీ ((Delhi) లిక్కర్‌ స్కామ్‌లో (Liquor Scam) అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court) వాదనలు ముగిశాయి. జడ్జి కావేరి బవేజ తీర్పును మే 2కు రిజర్వ్ చేశారు. కాగా సీబీఐ అరెస్ట్‌లో కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఒక మహిళగా ఆమె పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలన్నారు.

Will come out like a washed pearl.. Judgment reserved on Kavitha's bail petitionఅరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదని పేర్కొన్నారు.. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు వివరించారు.. అలాగే ఈడీ కస్టడీలో ఉన్నవేళ సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని ప్రశ్నించిన లాయర్.. అసలు అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని అన్నారు.. ఆమె పార్టీకి స్టార్ క్యాంపైనర్ అని పేర్కొన్నారు.. రూలింగ్‌లో ఉన్నప్పుడే ఏం చెయ్యలేకపోయామన్నారు.

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నామని తెలిపిన వారు.. కవిత విషయంలో చిదంబరం జడ్జిమెంట్ సరిపోతుందన్నారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదని కవిత తరపున లాయర్లు వాదనలు వినిపించారు. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై 10 స్టేట్మెంట్స్ ఇచ్చారని కానీ ఈడీ ఆయనను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదన్నారు. అనుమనితురాలిగా కూడా లేని కవితను నింధితురాలిగా మార్చారని తెలిపారు.

కవిత, కేజ్రీవాల్ ను కలిపి విచారించడంలో ఈడీ విఫలం అయిందని కోర్టుకు తెలిపారు. విజయ్ నాయర్ సోషల్ మీడియా హ్యాండ్లర్, ఆయనతో సోషల్ మీడియా అంశం పైనే భేటి అయ్యింది.. అలాగే బుచ్చిబాబు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చాడు.. ఈడీ అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాక ఆయనకు బెయిల్ వచ్చిందని పేర్కొన్నారు. రాఘవ రెడ్డి బీజేపీ నుంచి పొత్తులో ఉన్న పార్టీ నుంచి పోటీలో ఉన్నాడని తెలిపారు.

శరత్ రెడ్డి బీజేపీ ఎలాక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తి. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవితను అరెస్ట్ చేశారు. కవిత ఆధారాలు ధ్వంసం చేశారు అంటున్నారు..కానీ ఆవిడ వాడిన ఫోన్లన్నీ ఈడీకి ఇచ్చారని వాదనలు వినిపించారు. అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ (CBI) వాదనలు వినిపించింది. ఆమె బయటికి వెళ్ళితే ప్రభావితం చేయగలుగుతారని పేర్కొంది.

అలాగే లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ తరపు న్యాయవాదలు కోర్టుకు వెల్లడించారు. కవితను ఫోన్లు అడిగిన తరువాత ఫోన్లను ఆమె ఫార్మాట్ చేశారన్నారు. అలాగే ఈడీ (ED) కేసులో బెయిల్ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి..

You may also like

Leave a Comment