Telugu News » Mallikarjun Kharge: ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన ఖర్గే.. చర్చకు సిద్ధమంటూ సవాల్..!

Mallikarjun Kharge: ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన ఖర్గే.. చర్చకు సిద్ధమంటూ సవాల్..!

024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress) పార్టీ ‘న్యాయ పాత్ర’ అనే పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ ఇటీవల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పూర్తిగా ముస్లిం లీగ్ ముద్ర ఉందని, ముస్లిం లీగ్ మ్యానిఫెస్టోలో ఏ భాగం మిగిలిపోయినా వామపక్షాలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయని ఆరోపించారు.

by Mano
Mallikarjun Kharge: Kharge, who sought the Prime Minister's appointment.. is ready for a discussion..

2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress) పార్టీ ‘న్యాయ పాత్ర’ అనే పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ ఇటీవల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పూర్తిగా ముస్లిం లీగ్ ముద్ర ఉందని, ముస్లిం లీగ్ మ్యానిఫెస్టోలో ఏ భాగం మిగిలిపోయినా వామపక్షాలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయని ఆరోపించారు.

Mallikarjun Kharge: Kharge, who sought the Prime Minister's appointment.. is ready for a discussion..

ఈ నేపథ్యంలో మోడీ ఆరోపణపై చర్చకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సవాల్ చేశారు. ఈ మేరకు తమ మేనిఫెస్టోపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అపాయింట్‌మెంట్ కోరారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకటనలపై ప్రధాని మోడీతో ఖర్గే మాట్లాడతారని వేణుగోపాల్ పేర్కొన్నారు.

పార్టీ తన మేనిఫెస్టోలో మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువతకు అండగా నిలిచిందని తెలిపారు. రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ అర్బన్ నక్సలిజం భావజాలం ఇంకా సజీవంగా ఉందని, తమ ప్రభుత్వం ఏర్పడితే చొరబాటుదారులకు తల్లులు, సోదరీమణుల ఆభరణాలు, వ్యక్తిగత ఆస్తులను కూడా పంచుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొందని విమర్శించారు.

కాగా, ప్రధాని మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. ప్రజల ఆస్తులు పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడా రాసి లేదని పార్టీ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనెట్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ప్రజలకు అనవసరమైన, తప్పుడు అంశాలు చెప్పి వారిని చిక్కుల్లో పడేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఈ ప్రకటనలకు సంబంధించి ఖర్గే సిద్ధమయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ఖర్గే మేనిఫెస్టోలోని ప్రతి విషయాన్ని ప్రధాని మోడీకి వివరిస్తారని తెలిపారు.

You may also like

Leave a Comment