Telugu News » Delhi Liquor Scam : మండోలి జైలు నుంచి మరో లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్.. ఆ ముగ్గురిపై ఫిర్యాదు..!

Delhi Liquor Scam : మండోలి జైలు నుంచి మరో లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్.. ఆ ముగ్గురిపై ఫిర్యాదు..!

గతంలో జరిగిన నెయ్యి డబ్బాల వ్యవహారం పై లేఖలో ప్రస్తావించిన సుఖేష్ చంద్రశేఖర్.. నెయ్యి కోడ్ లాంగ్వేజ్ తో ముడుపులు చేతులు మారినట్లు పేర్కొన్నారు..

by Venu
another-sensation-in-the-delhi-liquor-scam-case-kavitha-kejriwal-robbed-thousands-of-crores-by-sukesh-chandrasekhar

ఢిల్లీ (Delhi) లిక్క‌ర్ స్కామ్ (Liquor Scam) కేసులో అరెస్ట‌యిన సుఖేశ్ చంద్రశేఖర్ ప్ర‌స్తుతం మండోలి జైలు (Mandoli Jail)లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఒక్కొక్కటిగా లేఖలు రాస్తూ ట్విస్ట్ లు ఇస్తున్నారు.. అయితే, తాజాగా అరవింద్ కేజ్రీవాల్, కవిత (Kavitha), సత్యేంద్ర జైన్ లను గురించి ప్రస్తావిస్తూ లేఖ విడుదల చేశారు.. కేంద్ర హోంమంత్రికి లేఖ ద్వారా ఈ ముగ్గురిపై ఫిర్యాదు చేశారు..

Delhi-Liquor-Scamగతంలో జరిగిన నెయ్యి డబ్బాల వ్యవహారం పై లేఖలో ప్రస్తావించిన సుఖేష్ చంద్రశేఖర్.. నెయ్యి కోడ్ లాంగ్వేజ్ తో ముడుపులు చేతులు మారినట్లు పేర్కొన్నారు.. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయం నుంచి నగదును సేకరించినట్లు తెలిపారు.. కవిత సహకారంతోనే ఈ వ్యవహారమంత జరిగినట్లు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు..

అదేవిధంగా కవిత, అరవింద్ కేజ్రీవాల్, సతేందర్ జైన్, నా మధ్య జరిగిన వాట్సాప్ చాట్ యొక్క కొన్ని స్క్రీన్ షాట్లను మీకు జత చేసి పంపిస్తున్నానంటూ హోమ్ శాఖకు రాసిన లేఖలో వివరించారు.. కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఈ స్క్రీన్ షాట్లను జతపరుస్తున్నానని సుకేష్ చంద్రశేఖర్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ నేతృత్వంలోని AAP సిండికేట్‌కు సంబంధించి నా దగ్గర ఉన్న పూర్తి సాక్ష్యాలతో సహకారాన్ని అందిస్తానని లేఖలో ప్రస్తావించారు..

మరోవైపు గత రెండు సంవత్సరాలుగా ఊరిస్తున్న లిక్కర్ కేసు కీలక వ్యక్తుల అరెస్ట్ లతో మలుపు తిరిగింది. ఢిల్లీ సీఎం క్రేజీవాల్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ రాజకీయంగా ప్రకంపనాలను సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలున్న నేపథ్యంలో ఈ కేసు అంశం అంతలా వార్తల్లోకి రావడం లేదని ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తున్న వారు అనుకొంటున్నారు.. మరీ ఎన్నికలు ముగిసాగా ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకొంటాయో అనే ఆసక్తి నెలకొంది.

You may also like

Leave a Comment