దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఈసీ (EC) పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే రెండో విడత ఎన్నికలకు అంతా సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్-2 లోక్ సభ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై IMD, NDMA అధికారులతో చర్చలు జరిపారు..
కాగా ఈ సమావేశం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ (Rajeev Kumar), ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్, సుక్వీర్ సింగ్ సందు అధ్యక్షతన జరిగింది. ఈ భేటీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.. ఏప్రిల్ 26న జరగనున్న ఫేస్ -2 సార్వత్రిక ఎన్నికలకు (General Elections) సంబంధించి హీట్ వేవ్ పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి ఐఎండి డీజీ తెలిపారు.
అలాగే రెండవ దశలో ఎన్నికలు జరిగే 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్లు తెలిపిన ఐఎండి.. ఈసీఐ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ బృందం (Task Force Team) హీట్ వేవ్ సమీక్షిస్తుందని పేర్కొన్నారు..