Telugu News » Harish Rao : కాంగ్రెస్ పాలిట అవే భస్మాసుర హస్తం అవుతున్నాయి.. హరీష్ సంచలన వ్యాఖ్యలు..!

Harish Rao : కాంగ్రెస్ పాలిట అవే భస్మాసుర హస్తం అవుతున్నాయి.. హరీష్ సంచలన వ్యాఖ్యలు..!

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని తెలిపిన ఎమ్మెల్యే.. రెండు సార్లు దేశంలో కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కలేదని గుర్తు చేశారు.

by Venu
Although Harish Rao is accepting the challenge.. CM Revanth Reddy's key announcement

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రత్యర్థి పార్టీలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao), రేవంత్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పార్టీ అంటే మోసం, నమ్మక ద్రోహమని ఫైర్ అయ్యారు.

Another open letter from MLA Harish to CM Revanth Reddy.. Implement that promise immediately!మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తం అవుతున్నాయని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కరువు కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు అని ఎద్దేవా చేశారు. రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు ఇంకా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని అనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలన్నారు

అలాగే మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయన్న హరీష్.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2500 రూపాయల సహయం, కళ్యాణాలక్ష్మికి తులం బంగారం, నిరుద్యోగ భృతి పై మాట తప్పినందుకు కాంగ్రెస్ ని ఓడించాలని పేర్కొన్నారు.. నాలుగున్నర నెలల్లోనే సీఎం ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని తెలిపిన ఎమ్మెల్యే.. రెండు సార్లు దేశంలో కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కలేదని గుర్తు చేశారు.. మీ పాలన వద్దని ప్రజలు మీపై కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు.. మరోవైపు మీ పార్టీ నాయకులు మోత్కుపల్లి, హనుమంతరావు మా సీఎం కలవట్లేదని పేర్కొనడం శోచనియమని పేర్కొన్నారు.. ఇక మెడలో పేగులేసుకుంటా, మానవ బాంబునై పేలుతా, డ్రాయర్ ఊడగొడుతా అని సీఎం పదవికి అర్థం లేకుండా మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు..

You may also like

Leave a Comment