Telugu News » Delhi Police: కోహ్లీ-గంభీర్ ఫొటోను వాడుకున్న ఢిల్లీ పోలీసులు.. ఆసక్తికర ట్వీట్..!

Delhi Police: కోహ్లీ-గంభీర్ ఫొటోను వాడుకున్న ఢిల్లీ పోలీసులు.. ఆసక్తికర ట్వీట్..!

IPL 2024లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్(RCB VS KKR) మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన నెలకొంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్(Virat Kohli- Gautam Gambhir) మాట్లాడుకున్నారు. దీంతో ఇన్నాళ్లూ వీరి మధ్య ఉన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆర్సీబీ ఇన్సింగ్ టైమ్ అవుట్ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గంభీర్ విరాట్‌తో కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు కౌగిలించుకోవడం కనిపించింది.

by Mano
Delhi Police: Delhi Police used Kohli-Gambir photo.. Interesting tweet..!

ఐపీఎల్ చివరి సీజన్‌లో, గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లితో మైదానంలో గొడవకు దిగాడు. అదేవిధంగా ఐపీఎల్ 2013లో గంభీర్ కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా కోహ్లీతో గొడవపడ్డాడు. ఈ గొడవకు సంబంధించి గతంలో ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేశారు. ఈలాంటి గొడవలు జరిగిన సరే 112కు డయల్ చేయండి అని తెలిపారు.

అయితే తాజాగా ఢిల్లీ పోలీసులు మరోసారి గంభీర్-కోహ్లీ కలుసుకున్న ఫొటోను బాగానే వాడుకున్నారు. ఇద్దరూ కలుసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘ఏ సమస్య వచ్చినా సాయం చేయడానికి 112 సిద్ధంగా ఉంది’ అని రాసుకొచ్చారు. ఈ ఫోటో గురించి చెబుతూ.. ఏదైనా ‘ఒక గొడవ జరిగిందా? 112కు డయల్ చేయండి.. దాన్ని మేము పరిష్కరిస్తాం.. ఏ గొడవ పెద్దది కాదు అంటు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టంట తెగ వైరల్ అవుతోంది.

మరోవైపు శనివారం జరిగిన మ్యాచ్‌లో గంభీర్, కోహ్లిని హగ్ చేసుకోవడంతో కామెంటేటర్లు రవిశాస్త్రి, గవాస్కర్ భిన్నంగా స్పందించారు. ఈ ఆలింగనానికి కేకేఆర్‌కు ఫెయిర్ అవార్డు ఇవ్వాలని రవిశాస్త్రి అన్నారు. అయితే ఫెయిర్ అవార్డు మాత్రమే కాకుండా ఆస్కార్ కూడా ఇవ్వొచ్చని గవాస్కర్ సరదాగా అన్నారు. అయితే గవాస్కర్ ఉద్దేశం ఏమై ఉంటుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

You may also like

Leave a Comment