తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ (BRS) తీరు వివాదాస్పదం అవుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. అదీగాక ఈ రోజు వరకు ఎన్నికల తీర్పు మీద కేసీఆర్ స్పందించక పోవడం చర్చాంశనీయంగా మారింది. ప్రజల పట్ల అణకువ లేదు, వ్యక్తిగత, రాజకీయ ధోరణుల్లో అదే అహం అనే భావన కలుగుతుందని అనుకొంటున్నారు..
ఇదంతా పక్కన పెడితే.. రాష్ట్ర సీఎం గా రేవంత్ (Revanth) ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అభినందించలేదు సరే, తనను ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పారు.. కనీసం ఆ తీర్పును శిరసావహిస్తాననే మాట కూడా కేసీఆర్ (KCR) నోటి నుంచి రాలేదనే టాక్ జనంలో వినిపిస్తుంది. ఈ సమయంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడటం కనిపిస్తుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు..
తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను నిజం చేయడంతో పాటు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పనిచేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుందని, అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని తెలిపారు. తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్ని ఇబ్బందులున్న అధిగమించి, సంపద సృష్టించి, ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని భట్టి పేర్కొన్నారు.
కాంగ్రెస్ నెల రోజుల పాలనపై స్పందించిన భట్టి విక్రమార్క.. రాష్ట్ర విభజన చట్టాల హామీలు అమలు కోసం కేంద్రానికి విన్న విస్తామని, ఎలాంటి భేషజాలాలకు పోకూండా వ్యవహరిస్తామని తెలిపారు. రాజకీయాలు ఎన్నికలప్పుడే, కానీ ఇప్పుడు పాలన అభివృద్ధి ముఖ్యమని వెల్లడించారు. మరోవైపు అర్థిక శాఖపై సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క.. రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని వెల్లడించారు.