Telugu News » Discussion About FTA: రిషి సునాక్‌కు మోడీ ఫోన్‌కాల్.. వాణిజ్య ఒప్పందంపై చర్చ..!

Discussion About FTA: రిషి సునాక్‌కు మోడీ ఫోన్‌కాల్.. వాణిజ్య ఒప్పందంపై చర్చ..!

బ్రిటన్ ప్రధాని​ రిషి సునాక్‌(British PM Rishi Sunak)తో భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) మంగళవారం ఫోన్​లో మాట్లాడారు. భారత్​-యూకేల 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' గురించి ప్రత్యేకంగా చర్చించారు.

by Mano
Discussion About FTA: Modi phone call to Rishi Sunak.. Discussion on trade agreement..!

బ్రిటన్ ప్రధాని​ రిషి సునాక్‌(British PM Rishi Sunak)తో భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) మంగళవారం ఫోన్​లో మాట్లాడారు. రానున్న హోలీ పండుగను పురస్కరించుకుని ఒకరికొకరు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భారత్​-యూకేల ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ గురించి ప్రత్యేకంగా చర్చించారు. రానున్న రోజుల్లో భారత్‌, బ్రిటన్‌ మధ్య మైత్రిని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోడీ, సునాక్‌ నిశ్చయించుకున్నారు.

Discussion About FTA: Modi phone call to Rishi Sunak.. Discussion on trade agreement..!

ఈ ‘ఫ్రీ ట్రైడ్​ అగ్రిమెంట్'(FTA)ను వీలైనంత త్వరగా చేసుకోవాలని నిర్ణయించారు. ఇది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. పరస్పర ప్రయోజనకరమైన ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని’ ముగించడానికి కృషి చేస్తామని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య 36 బిలియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్ల విలువ చేసే ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది.

భారత్‌-ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇటీవలే కుదిరింది. ఐరోపా రానున్న 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. మరోవైపు ‘రోడ్‌మ్యాప్‌ 300’ కింద వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, అత్యాధునిక సాంకేతికతలు సహా వివిధ రంగాల్లో సాధిస్తున్న పురోగతిపై మోడీ, సునాక్‌ ఇరువురూ సంతృప్తి వ్యక్తం చేశారు.

అదేవిధంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. ఫలితంగా స్విట్జర్లాండ్‌ వాచీలు, కట్‌ అండ్‌ పాలిష్డ్‌ వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల లాంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. అయితే ఎఫ్‌టీఏలో పెట్టుబడుల హామీకీ చట్టబద్దత లభించడం ఇదే తొలిసారి. దీని అమలుకు మరో ఏడాది పట్టే అవకాశముంది.

You may also like

Leave a Comment