Telugu News » Saidireddy: మాజీ ఎమ్మెల్యే వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌..!

Saidireddy: మాజీ ఎమ్మెల్యే వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌..!

దీనికి సంబంధించిన వాయిస్ రికార్డ్ (Teleconference Voice Record) సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో సైదిరెడ్డి ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తాను పార్టీ మారడానికి గల కారణాలను వివరించారు.

by Mano
Saidireddy: Former MLA's voice recording is viral..!

ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన హుజూర్‌నగర్ బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి (Ex MlA Saidireddy) టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దీనికి సంబంధించిన వాయిస్ రికార్డ్ (Teleconference Voice Record) సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో సైదిరెడ్డి ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తాను పార్టీ మారడానికి గల కారణాలను వివరించారు.

Saidireddy: Former MLA's voice recording is viral..!

చెప్పకుండా వెళ్లడం తప్పేనని, అందుకు క్షమించాలని, కానీ తన వెంట ఉంటారనే నమ్మకంతోనే వెళ్లానని వారికి వివరణ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వాయిస్‌ రికార్డ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సైదిరెడ్డి సంభాషణ ఇలా సాగింది. ‘రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోంది. బీఆర్‌ఎస్‌ పరిస్థితి అర్థం కావడం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు చాలామంది భయపడుతున్నారు’ అంటూ హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

అదేవిధంగా ‘ఢిల్లీ రావాలని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. అమిత్‌ షా ఆధ్వర్యంలో ఇప్పుడు కండువా కప్పుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుందని ఒత్తిడి తెచ్చారు. నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నా. బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు పార్టీ పరిస్థితి మీకు తెలుసు. ఒక్క సర్పంచ్‌ లేడు. నేను వచ్చాకనే 120 సర్పంచ్‌లు, 17 పీఏసీఎస్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిపించుకున్నాం. యువతకు ఏం చేయలేదనే బాధ ఉంది’ అంటూ తెలిపారు.

‘ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంది. మళ్లీ మోదీనే వస్తారు. అప్పుడు మనం యూత్‌కు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలు తీసుకురావచ్చు. ఇన్నాళ్ల చరిత్రలో ఇంత క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న మోడీలాంటి నాయకుడు లేడు. ఒక్క స్కాం లేదు. ఆయనకు కుటుంబం లేదు. దేశమే ఆయనకు కుటుంబం. ఆయన సపోర్టు ఉంటే మనకు మంచిదని ఆలోచించిన. వాళ్లు నన్ను కావాలని కోరుకోవడం నాకు మంచిదవుతుందనుకున్నా’ అని వెల్లడించారు.

అదేవిధంగా రేవంత్‌ రెడ్డిని దింపాలని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లే కోరుకుంటున్నరని, అప్పుడు తామే సహాయం చేసే అవకాశం ఉందన్నారు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే బీఆర్‌ఎస్‌ వాళ్లు చాలామంది భయపడుతున్నారని, రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో హుజూర్‌నగర్‌కు వచ్చి మీటింగ్‌ పెడ్తానని, అందరూ తనవెంటే ఉండాలని కోరారు. చివరగా ‘జై తెలంగాణ..’ అంటూ అని సైదిరెడ్డి సంభాషణ ముగించారు.

 

You may also like

Leave a Comment