Telugu News » Ayodhya : దర్గాల్లో దీపావళి… అయోధ్యకు ముస్లింలతో మార్చ్….!

Ayodhya : దర్గాల్లో దీపావళి… అయోధ్యకు ముస్లింలతో మార్చ్….!

‘రామ్ లల్లా’విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజున బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో దర్గాల్లో ‘దీపావళి’నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.

by Ramu
Diwali in dargahs BJP RSS mobilise Muslims for Ayodhya Ram temple consecration celebrations

అయోధ్య (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తమ ముస్లిం విభాగాలతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ (BJP), ఆర్ఎస్ఎస్ లు నిర్ణయించాయి. ‘రామ్ లల్లా’విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజున బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో దర్గాల్లో ‘దీపావళి’నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది. ఇక రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం ఆర్ఎస్ఎస్ అనుబంధ ముస్లిం మంచ్ సభ్యులు ఆధ్వర్యంలో అయోధ్యకు మార్చ్ చేస్తూ వెళ్లాలని ప్లాన్ చేస్తోంది.

Diwali in dargahs BJP RSS mobilise Muslims for Ayodhya Ram temple consecration celebrations

చారిత్రాత్మక జామా మసీదు, నిజాముద్దీన్ ఔలియా దర్గాతో సహా ఢిల్లీలోని పలు దర్గాలు, మసీదుల్లో దీపాలు వెలిగించే ప్రచారాన్ని బీజేపీ మైనారిటీ విభాగం నిర్వహిస్తోంది. మొత్తం 36 పవిత్ర స్థలాలను మైనారిటీ విభాగం ఎంపిక చేసిందని మోర్చా చీఫ్ జమాల్ సిద్ధిఖీ తెలిపారు.

ఈ దేశ చారిత్రక మేళవాన్ని జరుపుకునేందుకు జామా మసీదు, నిజాముద్దీన్ దర్గా, కుతుబ్ మినార్ ప్రాంతం సహా ఢిల్లీ అంతటా 36 దర్గాలు, ప్రసిద్ధ మసీదుల్లో దీపావళి వేడుకలను నిర్వహించాలని తాను ప్లాన్ చేశామని వెల్లడించారు. ఈ ప్రచారం జనవరి 12 నుండి 22 వరకు కొనసాగుతుందని తెలిపారు. తాము దేశ రాజధానిలోని ప్రసిద్ధ మసీదులకు వెళుతున్న సమయంలో దీపాలు వెలిగించే కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుందని వివరించారు.

మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ తన ముస్లిం మంచ్‌కు చెందిన క్యాడర్‌ను సమీకరించి ఆలయానికి మార్చ్ చేయాలని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మార్చ్ సమయంలో ఎక్కువ మంది కాలినడకనే ప్రయాణిస్తారని ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కొంత మంది సైకిళ్లు, బైకులపై ర్యాలీగా వస్తారని చెబుతున్నారు.

ఇది ఇలా వుంటే అయోధ్యలో అక్షత పూజ తర్వాత ఆ అక్షతలను దేశంలో ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. తాజాగా లక్నోలో అక్షతలను ముస్లి కరసేవకుడు మహ్మద్ హమీద్ కు అందజేశారు. దీంతో ఆయన బావోద్వేగానికి గురయ్యారు. తాను 30 ఏండ్లు చారిత్ర ఘట్టం (రామ మందిర ప్రారంభోత్సవం) కోసం ఎదురు చూస్తున్నానని తెలపారు.

You may also like

Leave a Comment