Telugu News » KCR : చీప్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ .. పార్టీ మారిన నేతలపై శివమెత్తిన కేసీఆర్‌..!

KCR : చీప్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ .. పార్టీ మారిన నేతలపై శివమెత్తిన కేసీఆర్‌..!

రాష్ట్రాన్ని దిగజారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని అన్నారు. రైతుల తరుఫున పోరాడుతాం.. వెంటాడుతాం.. తరుముతాం. లెక్కలన్నీ తీసి బజారులోకి ఈడుస్తామని ప్రభుత్వాన్ని గులాబీ బాస్ హెచ్చరించారు.

by Venu
congress

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కేసీఆర్ (KCR) విరుచుకు పడ్డారు.. బీఆర్‌ఎస్‌ (BRS) అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో ఏటా 30, 40 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండేది కాదని తెలిపారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ఏకంగా 3 కోట్ల టన్నులు దాటి ధాన్యం ఉత్పత్తి అయ్యిందని పేర్కొన్నారు. నేడు జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన అనంతరం సూర్యాపేటలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు..

Suspense continues on the selection of the Warangal BRS MP candidate.. four names on the screen?గతంలో రైతు సంక్షేమ విధానాలతో ఉత్పత్తి అధికమై పంజాబ్‌కే పోటీగా నిలిచి, అనతికాలంలో దేశంలోనే అగ్రస్థానానికి దూసుకుపోయిందని అన్నారు.. ఇంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రం పరిస్థితి ప్రస్తుతం ఇంత అధ్వాన్నంగా మారడానికి కారణం ఎవరు..? లోపం ఎక్కడున్నది..? అనేదాన్ని గమనించాలని కేసీఆర్‌ సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేవలం 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని కేసీఆర్ ఆరోపించారు..

రాష్ట్రాన్ని దిగజారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని అన్నారు. రైతుల తరుఫున పోరాడుతాం.. వెంటాడుతాం.. తరుముతాం. లెక్కలన్నీ తీసి బజారులోకి ఈడుస్తామని ప్రభుత్వాన్ని గులాబీ బాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా చేతులు ఎత్తి మొక్కుతున్న.. దయచేసి తెలంగాణలో రైతులు ఎవరూ ఆత్మ!హత్యలు చేసుకోవద్దని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొకోవాలని కేసీఆర్ తెలిపారు..

పంట నష్టం పోయిన రైతులకు ఎకరాకు ప్రభుత్వం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేసీఆర్ (KCR).. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మరీ డిసెంబర్ 9 వెళ్లిపోయి ఎన్ని రోజులయ్యిందని ప్రభుత్వాన్ని దెప్పిపొడిచారు.. ఇంత జరుగుతున్న పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎక్కడ నిద్రపోతున్నావని విమర్శించారు. మరోవైపు పార్టీ మారిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుక్కల్ని, నక్కల్నీ గుంజుకుని సంకలు గుద్దుకుంటున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు.. ఒకరిద్దరూ చిల్లర గాళ్లు పోతే పార్టీకి వచ్చిన నష్టమేమి లేదని విమర్శించిన కేసీఆర్ జెండా మార్చిన నేతలను జంతువులతో పోల్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుకోవడం చీప్ పాలిటిక్స్ అని విరుచుకుపడ్డారు.. చిల్లర పాలిటిక్స్ చేయడం మానుకొండని.. ప్రజల కోసం ఆలోచించండని హితవు పలికారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసగా షాకిస్తున్నారు.. ఇటీవల పార్టీ సీనియర్ నేతలు కడియం శ్రీహరి, కే కేశవరావు సైతం పార్టీ వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.. ఈ నేపథ్యంలో పార్టీ మారిన నేతలను చిల్లర గాళ్లూ, కుక్కలు, నక్కలు అని కేసీఆర్ అనడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

You may also like

Leave a Comment