Telugu News » Donald Trump: అవ‌స‌ర‌మైతే నియంత‌లా మారుతా: డోనాల్డ్ ట్రంప్‌

Donald Trump: అవ‌స‌ర‌మైతే నియంత‌లా మారుతా: డోనాల్డ్ ట్రంప్‌

త‌న‌కు రెండు టార్గెట్లు ఉన్నాయ‌ని, వాటిని నెర‌వేర్చేందుకు అవ‌స‌ర‌మైతే నియంత‌లా మారుతాన‌ని అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

by Mano
Donald Trump: Will become a dictator if necessary: ​​Donald Trump

అమెరికా(USA) మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) వార్నింగ్ ఇచ్చారు. త‌న‌కు రెండు టార్గెట్లు ఉన్నాయ‌ని, వాటిని నెర‌వేర్చేందుకు అవ‌స‌ర‌మైతే నియంత‌లా మారుతాన‌ని అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక‌వేళ మ‌ళ్లీ దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైతే నియంత త‌ర‌హాలో పాలించ‌నున్న‌ట్లు చెప్పారు.

Donald Trump: Will become a dictator if necessary: ​​Donald Trump

ఈ ఏడాది కూడా దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ ప‌డేందుకు రిప‌బ్లిక‌న్ నేత ట్రంప్ ఆస‌క్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే క్యాపిట‌ల్ హిల్ అటాక్ కేసులో ఆయ‌న్ను దోషిగా తేల్చి దేశాధ్య‌క్ష ప‌ద‌వికి దూరంగా చేయాల‌ని డెమోక్రాట్లు ప్ర‌య‌త్నిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్ర‌తిప‌క్షాలు త‌నను నియంత‌గా చిత్రీక‌రిస్తూ విజ‌యం సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ట్రంప్ ఆరోపించారు. అమెరికా, మెక్సికో బోర్డ‌ర్‌లో చొర‌బాట్ల‌ను ఆప‌డం, ఎన‌ర్జీ ప్రాజెక్టుల‌కు ఊతం ఇవ్వ‌డం త‌న ల‌క్ష్య‌మ‌ని తెలిపారు.

తానేమీ యుద్ధాలు చేయ‌లేద‌ని, విదేశాల్లో ఉన్న ద‌ళాల‌ను వెన‌క్కి ర‌ప్పించాన‌ని, కానీ అధ్య‌క్షుడు జో బైడెన్ మాత్రం యుద్ధ కాంక్ష‌నే రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా వాడుకుంటున్నార‌ని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్‌నకు రెండో సారి అధికారం ఇస్తే అమెరికా ప్ర‌జాస్వామ్యం నాశ‌నం అవుతుంద‌ని ఇటీవ‌ల బైడెన్ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment