Telugu News » Sridhar Babu : ఆ విషయంలో మీడియాకు లీకులు ఇవ్వొద్దు.. హెచ్చరించిన ఐటీ మంత్రి.. !!

Sridhar Babu : ఆ విషయంలో మీడియాకు లీకులు ఇవ్వొద్దు.. హెచ్చరించిన ఐటీ మంత్రి.. !!

ఐటీపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాల విషయంలో మీడియాకు లీకులు ఇవ్వొద్దని శ్రీధర్ బాబు, అధికారులకి తెలిపినట్టు సమాచారం.. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకూడదని ఐటీ సెక్రటరీ, అధికారులను మంత్రి హెచ్చరించినట్టు తెలుస్తోంది.

by Venu

నిజం నీరులా ప్రవహిస్తే అబద్ధం నిప్పులా ఊరంతా చుట్టేస్తుందని అంటారు.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆ పార్టీ నేతలు మండిపడుతోన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోన్న తప్పుడు ప్రచారాలపై ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. గురువారం ఉదయం ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ బాబు.. సంబంధిత అధికారులతో మొదటి సారి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐటీపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాల విషయంలో మీడియాకు లీకులు ఇవ్వొద్దని శ్రీధర్ బాబు, అధికారులకి తెలిపినట్టు సమాచారం.. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకూడదని ఐటీ సెక్రటరీ, అధికారులను మంత్రి హెచ్చరించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి తరలి పోతున్నాయని జరుగుతోన్న దుష్పచారం పై శ్రీధర్ బాబు (Sridhar Babu) సీరియస్ అయ్యినట్టు సమాచారం..

కాగా హైదరాబాద్ (Hyderabad) లో స్థాపించాలని భావించిన కార్నింగ్ సంస్థ (Corning Company) తన ప్లాంట్ ను తెలంగాణ (Telangana)లో కాకుండా చెన్నైకి తరలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.. తమిళనాడులో ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ మెరుగ్గా ఉండటంతో పాటు.. ఆపిల్ సప్లయర్లు కూడా చేరువగా ఉంటారనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆ వార్తల్లో పేర్కొన్నారు.

కానీ ఈ నిందను కాంగ్రెస్ ప్రభుత్వం పై మోపి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోన్నట్టు తన దృష్టికి వచ్చిందని శ్రీధర్ బాబు తెలిపారు. ఇలాంటి వార్తల విషయంలో కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్లే కార్నింగ్ సంస్థ పొరుగు రాష్ట్రాన్ని ఎంచుకుందనే వార్తలను అరికట్టాలని అధికారులని శ్రీధర్ బాబు ఆదేశించారు..

You may also like

Leave a Comment