Telugu News » రైతు రాజ్యం.. బీజేపీ సర్కార్ తోనే సాధ్యం

రైతు రాజ్యం.. బీజేపీ సర్కార్ తోనే సాధ్యం

by admin
eatala rajender fire on cm kcr

రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. లక్షా 25 వేల ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాలను పీఎం మోడీ ప్రారంభించారు. రాజస్థాన్​ సికర్ ​లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కేంద్రాలను వన్​ స్టాప్ కేంద్రాలుగా అభివర్ణించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత నిధులను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ బస్టాండ్ వద్ద ఉన్న గణేష్ అగ్రో ఏజెన్సీస్ లో ఏర్పాటు చేసిన లైవ్ ప్రోగ్రాంలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

eatala rajender fire on cm kcr

ప్రధాని మోడీ 11 కోట్ల మంది రైతులకు ప్రధాని సమ్మాన్ నిధి ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధర పెరిగినా మన దేశంలో పెరగకుండా సబ్సిడీతో అన్నదాతలకు అందిస్తున్నారని వివరించారు. ఓ యూరియా బస్తా 2503 రూపాయలు ఉంటే 2236 రూపాయల సబ్సిడీ ఇచ్చి రైతులకు 267 రూపాయలకు కేంద్రం అందిస్తోందని తెలిపారు. అలాగే, డీఏపీ బస్తా 3711 రూపాయలు ఉంటే 2422 రూపాయల సబ్సిడీ ఇచ్చి 1300 రూపాయలకే ఇస్తోందన్నారు.

eatala rajender fire on cm kcr 1

అమెరికాలో యూరియా బస్తా 3 వేల రూపాయలు, పాకిస్థాన్ లో 800, బంగ్లాదేశ్ లో 720 రూపాయలకు అందిస్తుంటే మన దేశంలో మాత్రం 267 రూపాయలకే అందిస్తున్నారని వివరించారు ఈటల. యూరియా, డీఏపీ, 20-20లతో సంవత్సరానికి ఒక ఎకరానికి 20 వేల రూపాయల వరకు బీజేపీ సర్కార్ సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. అలాగే, పెట్టుబడి సాయంగా 6 వేల రూపాయలు ప్రతి ఎకరానికి సమ్మాన్ నిధి కింద అందిస్తోందన్నారు. రైతులకు అవసరం అయిన అన్ని వస్తువులు, ఎరువులు, విత్తనాలు ఒకే దగ్గర లభించేలా 1.25 లక్షల షాపులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

పంటకి 5 వేల రూపాయలు ఇచ్చి అన్నీ తానే ఇచ్చానని కేసీఆర్ చెప్పుకుంటారని మండిపడ్డారు ఈటల. కేసీఆర్ వచ్చాక సబ్సిడీ విత్తనాలు లేవు, ఎరువులు లేవన్నారు. అనేక పనిముట్ల సబ్సిడీ తొలగించారని మండిపడ్డారు. కిసాన్ సర్కార్ అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 5 పైసలు ఇవ్వని కేసీఆర్ మన డబ్బులు తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో ఇవ్వడం సిగ్గుచేటన్నారు. భారత ప్రభుత్వం పంట నష్టం కోసం ఫసల్ భీమా యోజన స్కీమ్ తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన వాటా కట్టకపోవడం వల్ల ఆ డబ్బులు రావడం లేదని తెలిపారు. హెలికాప్టర్ లో వెళ్ళి అకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన వారికి 10 వేలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మెసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులందరూ ఈ విషయాలను గమనించాలని కోరారు.

రాష్ట్రంలో వడ్లు కొంటోంది కేంద్రమేనని.. సుతిలి, దబ్బనం, ట్రాన్స్ పోర్ట్, కొనుగోలుకు డబ్బులు, ఇంట్రెస్ట్ కూడా కేంద్రమే ఇస్తోందని వివరించారు రాజేందర్. కానీ, కేసీఆర్ మాత్రం పండిన ధాన్యం కొనడం లేదని ఆరోపించారు. ఆలస్యం కావడం వల్ల వర్షాలకు తడిచి రైతులు నష్టపోతున్నారని.. ఒక చేత్తో 5 వేలు ఇచ్చి ఇంకో చేత్తో ఆ డబ్బులు లాక్కుంటున్నారని మండిపడ్డారు. పేరుకే రైతు ప్రభుత్వం తప్ప చేతల్లో కాదని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే రైతులకు కన్నీళ్లు లేకుండా చేస్తామన్నారు. కౌలు రైతులకు భద్రత కలిపిస్తామని.. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్వరాజ్యమే తమ లక్షమని మోడీ నిరూపించారని.. కేసీఆర్ మోసపు మాటలు నమ్మవద్దని రైతుల్ని కోరారు ఈటల రాజేందర్.

You may also like

Leave a Comment