Telugu News » కాకి ముక్కుకి దొండ పండులా దొరికిన చద్దా..!

కాకి ముక్కుకి దొండ పండులా దొరికిన చద్దా..!

by admin
AAP MP Raghav Chadha Attacked By A Crow

పాత కక్షలున్నాయో.. లేదా ప్రతిపక్షాల కుట్రో.. మరి, తాను ప్రేమించిన పరిణీతితో పెళ్లికి తయారయ్యాడన్న ఉక్రోశమో..!?మొత్తానికి ఏంటో తెలియదు. లోకులు కాకులు అంటారుగా.. ఆ కాకులలో ఒకటి.. ఆప్ ఎంపీ రాఘవ చద్దాను చికాకుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

AAP MP Raghav Chadha Attacked By A Crow

పార్లమెంట్ దగ్గర అకస్మాత్తుగా వచ్చి ఎంపీ చ‌ద్దాను ఎటాక్ చేసింది ఓ కాకి. వ‌ర్షాకాల స‌మావేశాల‌కు వ‌చ్చిన ఆయన.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఫోన్ మాట్లాడుతూ క‌నిపించారు. ఆ స‌మ‌యంలో.. ఓ కాకి సడెన్ గా వచ్చి రాఘ‌వ్ నెత్తిపై పొడిచింది. ఈ ఘ‌ట‌న‌కు చెందిన ఫోటోల‌ను బీజేపీకి చెందిన ఢిల్లీ యూనిట్ త‌న ట్విట్టర్‌ లో పోస్టు చేసింది. ‘‘జూట్ బోలే క‌వ్వా కాటే’’ అంటూ ఈ ఫోటోకు కామెంట్ పెట్టారు నేతలు.

ఇంతకాలం ఈ మాట విన్నాం, ఇప్పుడు అబ‌ద్ధాలు చెప్పిన ఎంపీ రాఘ‌వ్‌ ను కాకి పొడిచేది చూశామ‌ని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ తేజింద‌ర్ పాల్ సింగ్ బ‌గ్గా కూడా ఈ ఫోటోపై సెటైర్లు వేశారు. కాకి ఎటాక్ ఫోటోను చూసి త‌న గుండె త‌రుక్కుపోయింద‌ని, బ‌హుశా ఎంపీగారి ఆరోగ్యం బాగుంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

మణిపూర్‌ లో దౌర్జన్యాలను బీజేపీ దాచిపెట్టాలనుకుంటోంది ఇటీవల రాఘవ్ చద్దా విమర్శించారు. అలాగే, పార్లమెంట్‌ కార్యకలాపాలను అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రాఘవ్ వ్యాఖ్యలకు తాజాగా కాకి ఎటాక్ కు లింక్ చేసి బీజేపీ కౌంటర్ దాడి జరుపుతోంది.

You may also like

Leave a Comment