తెలంగాణ (Telangana) ఉద్యమ నాయకుడిగా పేరున్న ఈటల రాజేందర్ (Eatala Rajender) రాజకీయ ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగుతోందా? అనే అనుమానాలు ఆయన అభిమానుల్లో నెలకొన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ (BRS) పార్టీలో కింగ్ లా ఉన్న ఈటల.. కారు దిగినాక.. బీజేపీలో (BJP) చేరిన విషయం తెలిసిందే.. అయితే గులాబీలో దక్కినంత ప్రయార్టీ.. కాషాయంలో లేదని ప్రచారంలో ఉంది. మరోవైపు హుజూరాబాద్ (Huzurabad)లో వచ్చిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఈటల గెలుపొందారు.
ఆ జోష్ లో ఉన్న ఈటల.. ప్రజల్లో తనకి తిరుగులేదని భావించి.. ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ తో పాటుగా.. సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లో పోటీ చేస్తానని ప్రకటించారు.. ఇక్కడే ఈటల రాంగ్ టర్న్ తీసుకొన్నట్టు వాదనలు వినిపిస్తోన్నాయి.. సొంత నియోజక వర్గ ప్రజలని గాలికి వొదిలేసి.. కేసీఆర్ పై పంతానికి పోయి.. ఈటల రెండు చోట్ల ఓటమి మూటగట్టుకొన్నారని ఆయన అభిమానులు హర్ట్ అయ్యారు.. ఇక ఆయన ఓటమి అనంతరం.. బీజేపీలో ఈటల పరిస్థితి ఏంటనే ప్రశ్న అభిమానుల మనసులను తొలిచేస్తోందని అనుకొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈటల.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. బుధవారం హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.. పోటీ ఎక్కడి నుంచి అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని వెల్లడించారు.. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత తన నియోజకవర్గంపై కేసీఆర్ పగబట్టారని మండిపడ్డ ఈటల.. ఎమ్మెల్యే హక్కులను హరించి తనను శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహించకుండా చేశారని ఆరోపించారు.
తాను ఉపఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారని.. తెరవెనుక డ్రామాలు చేసి హుజురాబాద్‌లో బీఆర్ఎస్ గెలిచిందని కేసీఆర్‌పై, ఈటల మండి పడ్డారు.. అయినా ఉన్న ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకొనేలా నిర్ణయాలు తీసుకొని.. ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని ఆయన అభిమానులు అనుకొంటున్నారు..