Telugu News » Khammam : క్లారిటీ లేని వ్యక్తిని ఎన్నుకుంటే అరాచక పాలన కోరుకున్నట్టే.. పొంగులేటి..!!

Khammam : క్లారిటీ లేని వ్యక్తిని ఎన్నుకుంటే అరాచక పాలన కోరుకున్నట్టే.. పొంగులేటి..!!

ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి ఏ సామాజిక వర్గం దగ్గరకు వెళ్తే ఆ సామాజిక వర్గం వాడిగా చెప్పుకునే అలవాటు ఉందని, తనపై తనకే క్లారిటీ లేని అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఖమ్మంలో అరాచక పాలన కొనసాగుతుందని పొంగులేటి ఎద్దేవా చేశారు.

by Venu
ponguleti

రాజకీయాల్లో అవినీతి ఉంటుందని తెలుసు కానీ అభివృద్థి పేరు చెప్పుకుని ఇంత అడ్డగోలు దోపీడి చేస్తారని ఇప్పుడే తెలిసిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఖమ్మం జిల్లా 32 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన అధికార పార్టీపై చురకలు అంటించారు. ఖమ్మం (Khammam)లో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా పని చేసి దొరికినంత దోచుకుని దాచుకున్నారని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పొంగులేటి ఆరోపించారు.

Ponguleti

ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు వేరు వేరు కాదు రెండు ఒక్కటే అని పొంగులేటి అన్నారు.. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి ఏ సామాజిక వర్గం దగ్గరకు వెళ్తే ఆ సామాజిక వర్గం వాడిగా చెప్పుకునే అలవాటు ఉందని, తనపై తనకే క్లారిటీ లేని అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఖమ్మంలో అరాచక పాలన కొనసాగుతుందని పొంగులేటి ఎద్దేవా చేశారు. ఖమ్మం నియోజక వర్గంలో అరాచక పాలన నడిపే వ్యక్తి కావాలా? అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా? అని ప్రశ్నించారు.

ఇక ఆక్రమంగా సంపాదించిన డబ్బుతో నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఓ పెద్దమనిషి చెప్పడం సిగ్గుచేటని.. వేళ కోట్లు దోపిడి చేసిన ఆ పెద్దమనిషి విలువల కోసం మాట్లాడటం.. అరాచకం గురించి నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు చెబుతున్న తీరుగా ఉందని పొంగులేటి విమర్శించారు. అయినా మీ లాగా.. మా కుటుంబంలో ఎవరు రాజకీయంగా డబ్బు సంపాదించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేసే రాజకీయ పార్టీ, వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే కేసీఆర్ (KCR)అని పొంగులేటి ఆరోపించారు. ఖమ్మం జిల్లా ప్రజలు ప్రతి విషయం స్పష్టంగా గమనిస్తున్నారన్న పొంగులేటి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తుమ్మల నాగేశ్వరరావును గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు ఖమ్మంలో అత్యధిక మెజారిటీతో తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.

You may also like

Leave a Comment