Telugu News » Narsapur: ఎన్నికల సిత్రాలు.. పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డ భారీ నగదు..!

Narsapur: ఎన్నికల సిత్రాలు.. పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డ భారీ నగదు..!

నర్సాపూర్ -హైదరాబాద్ (Hyderabad) ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో గురువారం తనిఖీలు చేస్తున్న క్రమంలో.. ఓ వాహనంలో సరైన పత్రాలు లేకుండా రూ. 74 లక్షలు తరలిస్తుండడంతో పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకొని నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.

by Venu

తెలంగాణలో (Telangana) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపద్యంలో ఓటర్లకు పంచడానికి తెచ్చిన వస్తువులు, మద్యం సీసాలు భారీగా పట్టుబడుతున్నాయి. ఇప్పటికే రూ. 165 కోట్ల నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ రోజు నర్సాపూర్ (Narsapur) సమీపంలోని మల్లన్న టెంపుల్ (Mallanna Temple) వద్ద చేపట్టిన తనిఖీల్లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ. 74 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నర్సాపూర్ -హైదరాబాద్ (Hyderabad) ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో గురువారం తనిఖీలు చేస్తున్న క్రమంలో.. ఓ వాహనంలో సరైన పత్రాలు లేకుండా రూ. 74 లక్షలు తరలిస్తుండడంతో పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకొని నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.

అయితే ఈ నగదును ఏటీఎంలో (ATM) పెట్టడానికి తీసుకువెళుతున్నట్లు జిల్లాలోని పెద్ద శంకరంపేట్ గ్రామానికి చెందిన నర్ర శ్రీనివాస్ తెలిపారు. సరైన పత్రాలు చూపించి స్వాధీనం చేసుకున్న డబ్బును తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా సీఐ షేక్ లాల్ మదర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి ఎవరు డబ్బును తీసుకొని వెళ్లరాదని సూచించారు..

You may also like

Leave a Comment