Telugu News » Etala Rajender: కేసీఆర్ పార్టీలో చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా: ఈటల

Etala Rajender: కేసీఆర్ పార్టీలో చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా: ఈటల

ఈటల మాట్లాడుతూ.. బడుగులకు అధికారం రాకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారని మండిపడ్డారు. మాటలు చెప్పి దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. గిరిజన, ఆదివాసీ బిడ్డలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. అందరినీ మోసం చేసి ఆయన కుటుంబం తెలంగాణను పాలిస్తోందని ఆరోపించారు.

by Mano
Etala Rajender: Although KCR shed tears many times in the party: Etala

కేసీఆర్ (CM KCR) పార్టీలో బీసీగా వివక్ష చూసి చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ (BJP Leader Etela Rajender) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

Etala Rajender: Although KCR shed tears many times in the party: Etala

ఈటల మాట్లాడుతూ.. బడుగులకు అధికారం రాకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారని మండిపడ్డారు. మాటలు చెప్పి దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. గిరిజన, ఆదివాసీ బిడ్డలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. అందరినీ మోసం చేసి ఆయన కుటుంబం తెలంగాణను పాలిస్తోందని ఆరోపించారు.

‘బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారు.. బీసీలు అంటే కేసీఆర్‌కు చిన్న చూపు.. బీసీలంటే కేసీఆర్‌కు చులకన.. బీసీలకు అన్యాయం జరుగుతుందని చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా..’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దేశానికి బీసీని ప్రధాని చేసింది బీజేపీ అని చెప్పుకొచ్చారు. దళిత, మైనారిటీ, గిరిజన బిడ్డలను దేశ రాష్ట్రపతిని చేసింది బీజేపీ మాత్రమే అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో అణగారిన వర్గాలను కాంగ్రెస్ చిన్న చూపు చూసిందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ఎంత మందికి టికెట్‌కు ఇచ్చారో చూశామన్నారు. బీజేపీ మాత్రం బీసీలకు 40 టికెట్‌లను కేటాయించబోతోందని తెలిపారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నట్లు ఈటల తెలిపారు.

You may also like

Leave a Comment