Telugu News » Dubbaka : ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ఓటుకి రూ.5 వేలు..?

Dubbaka : ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ఓటుకి రూ.5 వేలు..?

దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న రఘునందన్ రావు.. కేసీఆర్ (KCR)కి బీసీలను సీఎం చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. ముదిరాజ్ లకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించని కేసీఆర్.. ప్రతిపక్షాలను మాత్రం విమర్శించడం బాగా తెలుసని ఎద్దేవా చేశారు.

by Venu
raghunandan-rao

ఎన్నికలు వచ్చాయంటే ప్రచారాల హోరుతో రోడ్లు, గల్లీలు నిండిపోతాయి. ప్రస్తుత సీజన్ అదే కాబట్టి ఎక్కడ చూడు నేతల సందడి కనిపిస్తుంది. విరుపులతో, విమర్శలతో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు బరిలో ఉన్న నేతలు.. ఈ క్రమంలో దుబ్బాక (Dubbaka) బీజేపీ (BJP) అభ్యర్థి, ఎమ్మెల్యే (MLA)రఘునందన్ రావు (Raghunandan Rao) అధికార పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

raghunandan-rao-fire-on-kavitha-and-smita-sabarwal

దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న రఘునందన్ రావు.. కేసీఆర్ (KCR)కి బీసీలను సీఎం చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. ముదిరాజ్ లకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించని కేసీఆర్.. ప్రతిపక్షాలను మాత్రం విమర్శించడం బాగా తెలుసని ఎద్దేవా చేశారు. దళిత బంధు పేరుతో డబ్బులు పోగేసుకుంటున్నది ఎవరో తెలిసి కూడా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లింగపూర్ గ్రామంలో ఒక్క దళితునికి కూడా దళిత బంధు అందలేదని రఘునందన్ విమర్శించారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, కొత్త ప్రభాకర్ రెడ్డిపై రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా డబ్బులు కూడబెట్టిన ప్రభాకర్ రెడ్డి ఓటుకు రూ. 5000 పంచి గెలుస్తా అనే ధీమాతో ఉన్నాడని రఘనందన్ ఆరోపించారు..

ఈ ఎన్నికల్లో ఎవరు డబ్బులిచ్చిన కాదనకండని ఓటు మాత్రం తనకే వేయాలని రఘనందన్ ప్రజలను కోరారు. ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపితే సమస్యలపై పోరాటం జరుగుతుందని.. దొరల పాలనలో మన్నుతిన్న పాముల్లా తయారు అయిన నేతలని ఎన్నుకుంటే మిగిలేది బానిస బతుకులు అని వివరించారు.. తాను చేసిన అభివృద్థి గుర్తించి గెలిపించాలని రఘనందన్ ఓటర్లను కోరారు..

You may also like

Leave a Comment