పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ(Congress), సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth reddy) పదేపదే చేస్తున్న ప్రచారానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Mp Candidate Bandi Sanjay) కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ పదే పదే రిజర్వేషన్ల ప్రస్తావన తెస్తోందన్నారు.
బీజేపీ మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా రిజర్వేషన్లను రద్దుచేయబోమని, అలా చేస్తే అంబేడ్కర్ ను అవమానించినట్లు అవుతుందని ప్రధాని మోడీ ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చారని బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు.
అయినా కూడా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఓటమి భయంతో జనాలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ ఒక మతానికి పరిమితం కాదని, అన్నిమతాలను గౌరవిస్తుందన్నారు. ప్రజల్ని ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా బీజేపీ గెలుపును ఆపలేరన్నారు.
రాష్ట్రంలో బీజేపీ తప్పకుండా 12 ఎంపీ స్థానాలను గెలుస్తుందని, బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.ఈసారి బీజేపీ 400 ఎంపీ స్థానాలను తప్పకుండా క్రాస్ చేస్తుందన్నారు.ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోబోతుందన్నారు. ఇక బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని.. ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయమన్నారు.