Telugu News » తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ తో వచ్చిన.. తెలుగు సినిమాల లిస్ట్ ఇదే…!

తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ తో వచ్చిన.. తెలుగు సినిమాల లిస్ట్ ఇదే…!

ఫాదర్-డాటర్ సెంటిమెంట్ తో టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు !

by Sravya

టాలీవుడ్ లో ఇప్పటికే, తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఉన్న సినిమాలు చాలా వచ్చాయి. ఎప్పుడు వస్తున్న సైందవ్ తో పాటుగా టాలీవుడ్ లో తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ ఉన్న సినిమాల లిస్టు ని చూసేద్దాం.

రాయుడు:

మోహన్ బాబు, సౌందర్య, రచన తో వచ్చిన రాయుడు సినిమా తండ్రి కూతుర్ల సెంటిమెంటుతో ఉంటుంది. ఈ సినిమాలో కూతురు పాత్రలో ప్రత్యూష కనపడ్డారు. రవి రాజా పినిశేట్టి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ తండ్రి కూతుర్ల మధ్య ఎఫెక్షన్ ని బాగా చూపించారు.

దేవి పుత్రుడు:

వెంకటేష్, సౌందర్య, అంజలీ జవారి ఈ సినిమాలో నటించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా 2017 లో వచ్చింది.

డాడీ:

మెగాస్టార్ హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా వచ్చిన డాడీ సినిమాల్లో కూడా కూతురు తండ్రి సెంటిమెంట్ ని చూపించారు. సురేష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. చిరంజీవి కూతురు కింద అనుష్క మల్హోత్రా నటించారు. 2001లో ఈ సినిమా వచ్చింది.

విక్రమార్కుడు:

రవితేజ హీరోగా అనుష్క హీరోయిన్ గా వచ్చిన విక్రమార్కుడు సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 2006లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా లో కూడా తండ్రీ కూతురు సెంటిమెంట్ ని చూపించారు.

ఆకాశమంత:

ప్రకాష్ రాజ్ త్రిష తండ్రి కూతుర్లకు నటించారు. రాధా మోహన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఇందులో కూడా తండ్రి కూతురు సెంటిమెంట్ పెట్టారు.

నాన్న:

విక్రం హీరోగా అమలాపాల్ అనుష్క హీరోయిన్లుగా వచ్చిన నాన్న సినిమా కూడా తండ్రి కూతుర్ల సెంటిమెంట్తో వచ్చింది.

ఎంతవాడుగాని:

అజిత్ హీరోగా వచ్చిన ఎంతవాడుగాని సినిమాలో కూడా తండ్రి కూతురు సెంటిమెంట్ ని తీసుకువచ్చారు. గౌతం మీనన్ దర్శకత్వం వహించారు.

పోలీస్:

అట్లీ దర్శకత్వంలో వచ్చిన పోలీస్ సినిమాలో విజయ్, నైనిక మధ్య తండ్రి కూతుర్ల సెంటిమెంట్ చూపించారు.

దర్బార్:

రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో నివేత థామస్ కూతురుగా నటించారు. ఇందులో కూడా తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ని చూపించారు.

విశ్వాసం:

అజిత్, నాయనతార హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇందులో కూడా కూతురు సెంటిమెంట్ ని తీసుకువచ్చారు.

You may also like

Leave a Comment