Telugu News » Fire Accident : కాటేదాన్ లో అగ్నిప్ర‌మాదం.. భయాందోళనలో స్థానికులు..!!

Fire Accident : కాటేదాన్ లో అగ్నిప్ర‌మాదం.. భయాందోళనలో స్థానికులు..!!

ప్రమాద స‌మాచారం అందుకొన్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌లు అదుపులోకి తెచ్చారు.. కాగా ఈ ప్రమాదానికి కారణం షార్ట్ స‌ర్క్యూట్ అని తెలుస్తోంది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొన్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

by Venu

రంగారెడ్డి (Rangareddy) జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) సంభ‌వించింది. నేతాజీన‌గ‌ర్‌ (Netajinagar)లోని, ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో ఒక్కసారిగా మంట‌లు చెల‌రేగాయి. కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో, ఈ ప్రాంతంలో ద‌ట్టంగా పొగ‌లు అలుముకొన్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు.

ప్రమాద స‌మాచారం అందుకొన్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌లు అదుపులోకి తెచ్చారు.. కాగా ఈ ప్రమాదానికి కారణం షార్ట్ స‌ర్క్యూట్ అని తెలుస్తోంది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొన్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మరోవైపు ప్రకాశం జిల్లా (Prakasam District), త్రిపురాంతక మండలం, రేపల్లె (Repalle) గ్రామంలో ఉన్న ఎస్టీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది.

ఈ ఘటనలో మూడు పూరి గుడిసెలు అగ్నికి ఆహుతైయ్యాయి. గుడిసెల పక్కనే ఉన్న గడ్డివాముకి మంటలు అంటుకొని అగ్నికీలలు ఎగసిపడ్డాయి.. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అదుపులోకి రాలేదు. దీంతో వారు ఫైర్ ఇంజన్ సిబ్బందిని ఆశ్రయించారు. ఈ ఘటనలో నష్టపోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం..

You may also like

Leave a Comment