Telugu News » KTR : ఫార్ములా-ఈ రేసింగ్ రద్దు.. కేటీఆర్ సెటైర్లు..!

KTR : ఫార్ములా-ఈ రేసింగ్ రద్దు.. కేటీఆర్ సెటైర్లు..!

గ‌త బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ సంస్థ ఈ ప్రిక్స్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్లతో కలిసి 2023, అక్టోబర్ 30న రేసింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకొన్నారు. కానీ ప్ర‌స్తుతం కాంగ్రెస్ స‌ర్కార్ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది.

by Venu
Formula E race

నగరంలో మరోసారి కారు రేసింగ్‌ పోటీలను చూడాలనుకొన్న ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. హైదరాబాద్‌ (Hyderabad) వేదికగా ఫిబ్రవరి 10న జరగాల్సిన ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ E-ప్రిక్స్ ఫార్ములా- E’ రేసింగ్‌ (Formula E Race) రద్దైంది. తెలంగాణ (Telangana)లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ఫార్ములా -E నిర్వహకులు ప్రకటించారు.

మరోవైపు మున్సిప‌ల్ శాఖ‌.. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీ జ‌ర‌గిన ఒప్పందాన్ని మున్సిప‌ల్ శాఖ ఉల్లంఘించిన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో మున్సిప‌ల్ శాఖకు నోటీసులు జారీ చేసిన‌ట్లు వెల్లడించారు. కాగా హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చ‌ట్టాల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఎఫ్ఈవో తెలిపింది.

గ‌త బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ సంస్థ ఈ ప్రిక్స్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్లతో కలిసి 2023, అక్టోబర్ 30న రేసింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకొన్నారు. కానీ ప్ర‌స్తుతం కాంగ్రెస్ స‌ర్కార్ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. ఇక సీజ‌న్ 10 రేస్‌లు జ‌ర‌గ‌నున్న న‌గ‌రాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్‌, మొనాకో, లండ‌న్ న‌గ‌రాలు ఉన్నాయి. జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి ఈ సీజ‌న్ ప్రారంభంకానున్న‌ది. ఈ క్రమంలో ఫార్ములా-E రేసింగ్‌ మెక్సికోకు షిఫ్ట్ అయ్యింది.

అయితే గ‌త ఏడాది జ‌రిగిన ప్రారంభోత్స‌వ రేస్ చాలా స‌క్సెస్ అయ్యింద‌ని, ఆ రేస్ వ‌ల్ల సుమారు 84 మిలియ‌న్ల డాల‌ర్ల ఆర్థిక ప్ర‌గ‌తి జ‌రిగింద‌ని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డోడ్స్ తెలిపారు. అయితే తాజాగా కొత్త స‌ర్కారు తీసుకొన్న నిర్ణ‌యం త‌మ‌ను నిరాశ‌ప‌రిచిన‌ట్లు ఫార్ములా E చీఫ్ చాంపియ‌న్‌షిప్ ఆఫీస‌ర్ ఆల్బ‌ర్టో లాంగో తెలిపారు. మరోవైపు ఈ-ప్రిక్స్ ఈవెంట్‌ రద్దుపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న దుర్మార్గమైన తిరోగమన నిర్ణయమని అన్నారు. ఇలాంటి ఈవెంట్లు మన నగరం, దేశం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయని తెలిపారు.

You may also like

Leave a Comment