Telugu News » BJP : రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్!

BJP : రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్!

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని బీజేపీ(BJP) నాయకత్వం ఫోకస్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ.. రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ఫలితంగా అన్నదాతలు(Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించింది.

by Sai
Fulfill the promises given to the farmers immediately.. Union Minister Kishan Reddy's demand!

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని బీజేపీ(BJP) నాయకత్వం ఫోకస్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ.. రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ఫలితంగా అన్నదాతలు(Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించింది.

అన్నదాతలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (G.Kishanreddy) సోమవారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు.. వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా సాయం చెల్లించాలన్నారు. అదేవిధంగా రైతు కూలీలకు రూ.12వేలు, వరికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Fulfill the promises given to the farmers immediately.. Union Minister Kishan Reddy's demand!

క్రాప్ ఇన్స్యూరెన్స్ లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.గతంలో నియంత కేసీఆర్ ధన దాహానికి రైతులు బలయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రైతుల బతుకులు మారలేదన్నారు. ఆరు గ్యారెంటీలతో పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంద్నారు.100 రోజులు దాటినా 6 గ్యారెంటీల అమలు సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ బోగస్ డిక్లరేషన్ అన్నారు.

ఆరు గ్యారెంటీలు అమలవ్వాంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అంటున్నారు. కానీ, రేవంత్ రెడ్డి సీఎం ఉన్నంత కాలం రాహుల్ ప్రధాని కాలేరని కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత లేదు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రైతులు ఆ పార్టీకి ఓట్లేశారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే హామీలను త్వరగా అమలు చేయాలన్నారు.రేవంత్ పాలనలో రైతులకు బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదు. పంటలకు నీరు అందడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ, తెలంగాణ ప్రజల సోమ్మును సీఎం రేవంత్ ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు.

ఇక మోడీ గ్యారెంటీ అంటే ప్రతి రైతు అకౌంట్లో మోడీ డబ్బులు పడటం, 370 రద్దు చేస్తామని మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాం. త్రిఫుల్ తళాక్ రద్దు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చాం నిలబెట్టుకున్నo. తీవ్రవాదాన్ని కూకటివెళ్లతో పెకిలిస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ పార్టీ సత్తా 12 స్థానాలు గెలిచి తెలంగాణలో సత్తా చాటాలని చూస్తుంది. గతంలో హైదరాబాద్లో జరిగిన బీజేపీ సభలో అమిత్ షా ఇదే విషయంపై స్పందించారు.12 పార్లమెంట్ స్థానాలు సాధించేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు కలిసి పనిచేయాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజల్లో మైలేజ్ పెరిగేలా బీజేపీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో ప్రచార జోరును పెంచారు. ఇటీవల కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా రైతుల పక్షాన పోరాటం చేసేందుకు రైతు దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment