Telugu News » Garlic Price : మంటపెడుతున్న అల్లం వెల్లుల్లి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొంటున్న రైతులు..!

Garlic Price : మంటపెడుతున్న అల్లం వెల్లుల్లి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొంటున్న రైతులు..!

ప్రస్తుతం మార్కెట్లో వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల మార్క్‌ దాటగా.. అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది. దీంతో వంట గది నుంచి అల్లం, వెల్లుల్లి కనుమరుగు అవుతున్నాయి.. రెండు వారాల్లోనే వీటి ధరలు రెట్టింపు అవడంతో సామాన్యుడు షాక్ తింటున్నాడు.

by Venu

ఇప్పటికే అదుపు లేకుండా పెరుగుతోన్న నిత్యావసర సరకులతో సామాన్యుడు అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే.. మధ్యతరగతి మనిషి బ్రతుకు మండుతున్న ధరల మధ్య నలిగిపోతుంది. చాలీ చాలని జీతాలతో.. చావలేక బ్రతకలేక, బ్రతుకు బండిని భారంగా మోస్తున్న వేళ.. అల్లం (Ginger), వెల్లుల్లి (Garlic) ధరలు ఒక్క సారిగా ఆందోళన కలిగిస్తున్నాయి.. వీటి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల మార్క్‌ దాటగా.. అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది. దీంతో వంట గది నుంచి అల్లం, వెల్లుల్లి కనుమరుగు అవుతున్నాయి.. రెండు వారాల్లోనే వీటి ధరలు రెట్టింపు అవడంతో సామాన్యుడు షాక్ తింటున్నాడు.. ఈ రెండు వస్తువులు లేకుంటే కూరలు రుచిగా ఉండవు.. అందులో నాన్ వెజ్ లో అయితే ఇవి తప్పనిసరి.. దీంతో అయోమయంలో పడిపోయారు మధ్యతరగతి మనుషులు..

ఇక, దేశంలోని ప్రధాన నగరాల్లో వెల్లుల్లి ధర భారీగా పెరిగి కిలో 500-550 రూపాయల మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. రెండు వారాల తర్వాత కొత్త పంట వస్తే ధరలు తగ్గే ఛాన్స్ ఉందని వ్యాపారులు అంటున్నారు. నగరాలకు వెల్లుల్లి సరఫరా తక్కువగా జరుగుతుందని పేర్కొంటున్నారు.. మరోవైపు బహిరంగ మార్కెట్ లో ఎల్లిగడ్డల ధరలు మండి పోతుండటంతో పంట పొలాల నుంచి కొందరు దుండగులు వీటిని ఎత్తుకెళ్తున్నారు.

దీంతో అప్రమత్తం అయిన రైతులు పంటను కాపాడుకోవడం కోసం పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్‌ (Mohkhed) ప్రాంతంలో అయిదారు గ్రామాలకు చెందిన పొలాల్లో ఎల్లిగడ్డ చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఈ దొంగతనాలు అదుపులోకి వచ్చాయని స్థానికులు తెలిపారు.

You may also like

Leave a Comment