Telugu News » Hyderabad : హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. గ్యాస్ పైప్ లైన్ పగిలి..!!

Hyderabad : హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. గ్యాస్ పైప్ లైన్ పగిలి..!!

కుత్బుల్లాపూర్‌- కొంపల్లి (Kompally) ప్రధాన రహదారి పక్కన రోడ్డు విస్తరణ కోసం జేసీబీతో మట్టి తీస్తుండగా.. భూమిలో ఉన్న గ్యాస్ పైప్ లైన్ పగిలింది. వెంటనే పైపు లో నుంచి గ్యాస్ లీకవడం మొదలుపెట్టింది.

by Venu

ఈ మధ్య సంభవిస్తున్న మరణాలు, ప్రమాదాలు చూస్తుంటే.. ఎవరు దొరుకుతారా.. ప్రాణాలు తీసుకుందామా అని మృత్యువు ఎప్పుడు కాచుకున్నట్టు ఉంది. అందులో ఈ నగరానికి ఏమైందో తెలియదు గాని వరుసగా ఏదో ఒకరూపంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో అగ్ని ప్రమాదం హైదరాబాద్‌ (Hyderabad)లోని కుత్బుల్లాపూర్‌ (Quthbullapur)లో జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం..

కుత్బుల్లాపూర్‌- కొంపల్లి (Kompally) ప్రధాన రహదారి పక్కన రోడ్డు విస్తరణ కోసం జేసీబీతో మట్టి తీస్తుండగా.. భూమిలో ఉన్న గ్యాస్ పైప్ లైన్ పగిలింది. వెంటనే పైపు లో నుంచి గ్యాస్ లీకవడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సిగరెట్ తాగుతుండటంతో.. వారికి మంటలు అంటుకుని తీవ్రగాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.. దీంతో చుట్టుపక్కల ఉన్న జనం భయంతో పరుగులు తీశారు..

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, ట్రాఫిక్ ను మళ్లించారు. సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి సమాచారం అందించారు. వెంటనే వారు గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా గ్యాస్ ఏజన్సీ సిబ్బంది పగిలిన పైప్ లైన్ కు మర్మతులు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment