తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) , గవర్నర్ తమిళి సై (tamilisai) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య కొంతకాలం క్రితం వరకు పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఒకరి కార్యక్రమానికి ఒకరు హాజరు అయ్యేవారు కాదు.నన్ను సరిగా పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వం తరుఫున జరుగుతున్న ఏ కార్యక్రమానికి కూడా తనను పిలవడం లేదని గవర్నర్ బహిరంగంగానే చాలా సార్లు చెప్పారు.
ఒక రాష్ట్ర గవర్నర్ కి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా తనకు ఇవ్వడం లేదని ఆమె చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు కూడా. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య సఖ్యత కుదిరినట్లు కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కేసీఆర్, తమిళి సై ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే గురువారం నాడు వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. పట్నం మహేందర్ రెడ్డి (patnam mahendar reddy) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి, గవర్నర్ (governer) మధ్య నవ్వులు విరబూశాయి. దీంతో అక్కడ ఉన్న వారి దృష్టి అంతా వారిద్దరి మీదకు మళ్లింది. అంతేకాకుండా శుక్రవారం నాడు గవర్నర్ మరోసారి సచివాలయానికి రానున్నారు.
గవర్నర్ సచివాలయానికి రావడానికి గల కారణం ఏంటి అంటే.. గురువారం తమిళి సై, కేసీఆర్ మధ్య జరిగిన సంభాషణలో.. కొత్త సచివాలయం అద్భుతంగా ఉన్నది. ఈ మధ్య కొత్త సచివాలయం ముందు నుంచి వెళ్తున్నప్పుడు చూశాను. బాగుంద’ని గవర్నర్ అన్నారు. దానికి కేసీఆర్ నవ్వుతూ.. ‘హైదరాబాద్ గంగాజమునా తెహజీబ్‌కు ప్రతీకగా సచివాలయ ప్రాంగణంలో ఆలయం, మసీదు, చర్చి నిర్మించాం. శుక్రవారం పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 12 గంటలకు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రావాల’ని సీఎం గవర్నర్ ను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు.
దానికి ఆమె ప్రతిగా తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరవుతారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.