Telugu News » Hanumanta Rao : ఎంపీ టికెట్ రాకుండా ఆయన అడ్డుపడుతున్నారు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..!

Hanumanta Rao : ఎంపీ టికెట్ రాకుండా ఆయన అడ్డుపడుతున్నారు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..!

సొంత పార్టీలో తన మీద ఎందుకీ కక్ష అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు లోకల్ అంటున్నారు.. ఇదివరకు గెలిచిన వారంతా లోకలా అని ప్రశ్నించారు..

by Venu

త్వరలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) ఉన్న నేపథ్యంలో నేతల్లో హడావుడి మొదలైంది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) కాంగ్రెస్‌ (Congress)లో సీట్ల గలాటా మొదలైందని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ సీటు కోసం కొందరు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు (Hanumanta Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

VH: Justice for BC only if Congress comes to power: VHలోక్‌సభ ఎంపీగా తనకు అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. పార్టీలో పరిస్థితిని వివరిస్తూనే.. ఖమ్మం ఎంపీగా తనకు ఈసారైనా ఛాన్స్‌ ఇస్తే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే తనను ఎంపీగా పోటీ చేయకుండా తన పేరు లిస్ట్‌లో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌ను టార్గెట్‌ చేసి పలు విమర్శలు చేశారు.. ఈసారి ఎంపీ టికెట్‌ ఇస్తే గెలుస్తానంటూ వీహెచ్‌ వివరించారు.

సొంత పార్టీలో తన మీద ఎందుకీ కక్ష అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు లోకల్ అంటున్నారు.. ఇదివరకు గెలిచిన వారంతా లోకలా అని ప్రశ్నించారు.. భట్టి విక్రమార్క‌ ఈ స్థాయికి రావడంలో తన పాత్ర ఉందని పేర్కొన్న వీహెచ్‌.. తనకు ఖమ్మం ఎంపీ టికెట్‌ ఇవ్వకుండా భట్టి ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ప్రశ్నించారు. 2019లో భట్టి విక్రమార్క కనీసం తన పేరును కూడా అధిష్ఠానానికి పంపలేదని ఆరోపించారు..

ఇంకా ప్రజలకు సేవ చేయాలన్నదే తన తపన అని తెలిపారు. తన వయసు మించిపోలేదని తనలాగా చురుగ్గా పార్టీలో పనిచేసే నేత ఎవరూ లేరని వీహెచ్ కన్నీరు పెడుతూ గద్గద స్వరంతో పేర్కొన్నారు..

You may also like

Leave a Comment