Telugu News » Harish Rao : హరీష్ రావు సమక్షంలో జై కాంగ్రెస్ నినాదం.. పార్టీ మారిన నేతలు..!!

Harish Rao : హరీష్ రావు సమక్షంలో జై కాంగ్రెస్ నినాదం.. పార్టీ మారిన నేతలు..!!

టీవల రామ్మోహన్ గౌడ్ (Rammohan Goud) లక్ష్మీ ప్రసన్న (Lakshmi Prasanna) రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఎల్బీనగర్ నుండి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రామ్మోహన్ గౌడ్ కి అక్కడ చుక్కెదురైంది.

by Venu
Harish rao

తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారాలు (Election Campaigns)సాఫీగా సాగుతున్నాయి అని భావిస్తున్న తరుణంలో అక్కడక్కడా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ పై దాడి ఘటన రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. మరోవైపు పార్టీలు మారుతున్న నేతల వల్ల కార్యకర్తల మధ్య కూడా అప్పుడప్పుడు వివాదాలు చెలరేగడం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనే సాక్షాత్తు మంత్రి హరీష్ రావు (Harish Rao) ఎదుట జరిగింది.

ఇటీవల రామ్మోహన్ గౌడ్ (Rammohan Goud) లక్ష్మీ ప్రసన్న (Lakshmi Prasanna) రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఎల్బీనగర్ నుండి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రామ్మోహన్ గౌడ్ కి అక్కడ చుక్కెదురైంది. దీంతో నిరుత్సాహానికి గురైన రామ్మోహన్ గౌడ్ సొంతగూటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బీఎన్ రెడ్డి నగర్‌లోని రామ్మోహన్ గౌడ్ ఇంటికి వచ్చారు..

రామ్మోహన్ గౌడ్ నివాసంలో హరీష్ రావు మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న గంటసేపు చర్చలు జరిపారు. అనంతరం వీరిద్దరికీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు.. ఈ సమయంలో జై కాంగ్రెస్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కాసేపు రామ్మోహన్ గౌడ్ నివాసం రసభాసగా మారింది.

ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అటు బీఆర్ఎస్ కార్యకర్తలు నెట్టుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కార్యకర్తలను సముదాయించిన హరీష్ రావు.. నేటి నుండి రామ్మోహన్ గౌడ్ కు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్యకర్తల వివాదం సద్దుమనిగింది.

You may also like

Leave a Comment