Telugu News » Harish Rao: కొత్త జిల్లాలు, మండలాలను రద్దు చేస్తారట: హరీశ్‌రావు

Harish Rao: కొత్త జిల్లాలు, మండలాలను రద్దు చేస్తారట: హరీశ్‌రావు

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్ని రోజులు కుట్రలు చేసినా నిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు.

by Mano
Harish Rao: New districts and mandals will be cancelled: Harish Rao

ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తారంట.. అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే(Siddipeta MLA), మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లా(Medak District) మనోహరబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

Harish Rao: New districts and mandals will be cancelled: Harish Rao

ఎన్ని రోజులు కుట్రలు చేసినా నిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. కొత్త మండలాలు, జిల్లాలను రద్దు చేయడంతో పాటు కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటుందని, మరి కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్‌పై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

గజ్వేల్ డెవలప్‌మెంట్ అథారిటీని రద్దు చేశారని, మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని.. వారిది వారికే పడటం లేదని హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ అవినీతి అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.

కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైన వారి పిల్లలకు సహకారం అందిస్తామని చెప్పారు. అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత అని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment