Telugu News » YV Subba Reddy: వై నాట్ 175.. మార్పులు చేర్పులు అందుకే: వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy: వై నాట్ 175.. మార్పులు చేర్పులు అందుకే: వైవీ సుబ్బారెడ్డి

175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకే మార్పులు చేర్పులు జరుగుతున్నాయని వైసీపీ(YCP) రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) తెలిపారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా మార్పులు చేస్తున్నామన్నారు.

by Mano
YV Subba Reddy: Y Not 175.. Changes Additions Hence: YV Subba Reddy

175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకే మార్పులు చేర్పులు జరుగుతున్నాయని వైసీపీ(YCP) రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) తెలిపారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా మార్పులు చేస్తున్నామన్నారు.

YV Subba Reddy: Y Not 175.. Changes Additions Hence: YV Subba Reddy

ఉత్తరాంధ్రలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడానికి విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీకి అవకాశం కల్పించామని తెలిపారు. కుటుంబ పరంగా తాము సీట్లను ఇవ్వడం లేదని, ప్రజల్లో బలం, అర్హత ఉన్న వాళ్లకే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు అన్ని వర్గాలను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

మరోవైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతున్న విషయం తనకు తెలియదంటూ దాటవేశారు. ఇక, ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన విశాఖను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చొరవతో క్లీన్ సిటీగా విశాఖపట్నం జాతీయ స్థాయిలో నాలుగో స్థానానికి చేరుకుందని సుబ్బారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇక, ఎన్నికలకు సిద్ధం అవుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో మార్పులు, చేస్తోంది. ఈ క్రమంలో అసంతృప్త నేతలు పార్టీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కొన్ని అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేయగా.. ఇప్పుడు నాల్గో లిస్టుపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

You may also like

Leave a Comment