ఉన్నపాటుగా ఏమైందో తెలియదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut)నటుడు జాన్ అబ్రహం(John Abraham)ను ఆకాశానికి ఎత్తేసింది. తన ఇన్ స్టాలో ఈ విషయాన్ని వెల్లడించింది. జాన్ ఫొటోను తన అభిప్రాయానికి జతచేసి జనాల మీదకు విసిరింది.
ఎంతోమంది నెగెటీవ్ పీపుల్ కలిగివున్న సినీ పరిశ్రమలో జాన్ అబ్రహం వంటి దయగల వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పింది. ‘జాన్ నిజాయితీగల నటుడు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను తన సొంత కుటుంబంలా చూస్తాడు.
మహిళలను అసలే వేధించడు. పీఆర్, గ్రూపిజం గురించి పట్టించుకోడు. ప్రతికూల వ్యక్తుల గురించి మాత్రమే కాదు ఇలాంటి వారిని కూడా ఎప్పటికీ మనం మరచిపోకూడదు. నేను జాన్‌తో కలిసి పనిచేసిన అనుభవంతో చెబుతున్నా.
అతనితో స్నేహం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి పదాలు లేవు. చాలా మందికి అది తెలియకపోవచ్చు. ఎందుకంటే అతనిపై ప్రశంసలు కురిపించేందుకు మీడియాకు డబ్బు చెల్లించడు.
అతను కేవలం సెల్ఫ్ మేడ్ మ్యాన్ మాత్రమే కాదు అన్ని విధాలా విజయవంతమైన వ్యక్తి. అద్భుతమైన మనిషి. లవ్ యు జాన్’ అంటై తనదైన స్టైల్‌లో పొగిడేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.