Telugu News » Ta’marinda’ : చింతపండులో ఔషధ గుణాలు మెండు..తెలుసుకుంటే పులుసంటారు.!

Ta’marinda’ : చింతపండులో ఔషధ గుణాలు మెండు..తెలుసుకుంటే పులుసంటారు.!

చింతపండుని చూడగానే మోటుబావిలో నీళ్లూరినట్టు నోటి బావిలో నీళ్లూరతాయి.! బహుశా మన భారతీయులు చింత పండుని వాడుకున్నట్టు మరే దేశం వాళ్లు వాడుకోరేమో..!

by sai krishna

చింతపండుని చూడగానే మోటుబావిలో నీళ్లూరినట్టు నోటి బావిలో నీళ్లూరతాయి.! బహుశా మన భారతీయులు చింత పండుని వాడుకున్నట్టు మరే దేశం వాళ్లు వాడుకోరేమో..! పులుసులో, పులిహోరలో, చారు,సాంబార్, పానీపూరీ కర్రీ ఇలా ఒకటేంటి..ఎక్కడ వీలుంటే అక్కడ పిండిపోస్తారు. తగుమాత్రంగా వేస్తే భలే రుచిస్తుంది చింతపండు.

ఎక్కువ చింతపండు తింటే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందనే ఒక సైడ్ ఎఫెక్ట్ పక్కనబెడితే మనకు చింతపండు చేసే మేలు భలే భలే…! ఆలస్యం ఎందుకు చింత చేసే మేలేంటో చూసెద్దామా..! ప్రస్తుత జీవనవిధానంతో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు.

ఆ బరువు తగ్గేందుకు నానా పాట్లు పడుతున్నారు. వ్యాయామంతో పాటు బరువు తగ్గించేందుకు చింత పండు చిట్కా ఉంది. తరుచుగా చింతపండును తీసుకుంటే చాలా తొందరగా బరువు తగ్గుతారని చెబుతున్నారు.చింతపండులో ఇంకా ఎన్నో ఔషద గుణాలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.

మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు(Carbohydrates), విటమిన్లు ఇ, కె, సి, బి1, బి2, బి5, బి3, బి6 తో పాటుగా సోడియం, ఐరన్, ఎనర్జీ, జింక్, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

చింతపండులో ఉండే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్(Hydroxy citric acid)మనలో ఫ్యాట్ ప్రొడక్షన్ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే హెచ్‌సీఏ ఫ్యాట్(HCA fat)నిల్వలకు కారణమయ్యే ఎంజైమ్స్‌(Enzymes)కు అడ్డుగా నిలుస్తుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కొవ్వు తొందరగా కరిగేందుకు కూడా ఇది ఎంతో సహాయపడుతుందట.

చింతపండును రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. చింతపండులో పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు దీనితో మెటబాలిజం కూడా పెరుగుతుంది. తద్వారా ఆకలి చాలా వరకు తగ్గుతుంది.

దీంతో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారుచింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది.బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్(bad cholesterol) ను
కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ చింతపండు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.

You may also like

Leave a Comment