ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన బీఆర్ఎస్ (BRS).. మాటలకు కూడా పదును పెట్టిందని అనుకుంటున్నారు.. ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. ఓటర్లను దారిలోకి తెచ్చుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో (election campaign) పాల్గొన్న ఆరోగ్య శాఖ (Health Minister) మంత్రి హరీష్ రావు (Harish Rao).. కాంగ్రెస్ పై మండిపడ్డారు..
పొరపాటున కాంగ్రెస్ (Congress) పార్టీకి అధికారం ఇస్తే పదేండ్లు వెనక్కిపోతామని హరీష్ రావు విమర్శించారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ మాయ మాటలు చెబుతుందని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తో జాగ్రత్త గా ఉండాలని ప్రజలకు సూచించిన మంత్రి.. హస్తానికి అధికారం ఇస్తే మన కన్ను మనం పొడుచుకున్నట్టే అని విమర్శించారు.
సీఎం కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామరక్ష అని హరీష్ రావు స్పష్టం చేశారు. నేడు అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్న మంత్రి.. ఇబ్బందులు పెట్టె కాంగ్రెస్ కుట్రలను ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.. ఇక మంత్రి హరీశ్ రావు సమక్షంలో సిద్దిపేట (Siddipet)లో నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు కొందరు బీఆర్ఎస్ లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పిన హరీష్ రావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..