Telugu News » స్టార్ దర్శకులను ప్రేమించి.. పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!

స్టార్ దర్శకులను ప్రేమించి.. పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!

దర్శకులని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్స్ !

by Sravya

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి బాగా సెటిల్ అయిన వాళ్ళు హీరో హీరోయిన్ లని పెళ్లి చేసుకోవడం లేదంటే తోటి ఆర్టిస్టులుని పెళ్లి చేసుకోవడం వంటివి చూస్తూ ఉంటాము. అయితే చాలామంది హీరోయిన్లు దర్శకులని కూడా పెళ్లి చేసుకున్నారు. మరి అలా దర్శకులు ని పెళ్లి చేసుకునే వారి జాబితా ఇప్పుడు చూద్దాం.

రేవతి:

మలయాళం డైరెక్టర్ అయిన సురేష్ మీదని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. సురేష్ మీనన్ రేవతిల పెళ్లి 1986లో అయింది. తర్వాత 2014లో వీళ్ళు విడిపోయారు.

శరణ్య:

శరణ్య మొదట నటుడు సంపత్ దాస్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ మనస్పర్ధలు కారణంగా వీళ్ళు విడిపోయారు. తర్వాత తమిళ్ డైరెక్టర్ పోవన్నం ని పెళ్లి చేసుకున్నారు.

నయనతార:

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార దర్శకుడు అయిన విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడు సంవత్సరాలు పాటు వీళ్ళు రిలేషన్షిప్ లో ఉండి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

కుష్బూ:

నటి కుష్బూ డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

రోజా:

నటి రోజా 2002లో తమిళ్ డైరెక్టర్ సెల్వమణి ని పెళ్లి చేసుకున్నారు వీళ్ళది కూడా ప్రేమ పెళ్లి. తెలుగు తమిళం లో స్టార్ హీరోయిన్ గా ఉన్న టైంలోనే పెళ్లి చేసుకున్నారు.

Also read:

సుహాసిని:

సుహాసిని దర్శకుడు మణిరత్నం ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు డైరెక్టర్లుని పెళ్లి చేసుకున్న వాళ్ళలో ఈమె కూడా ఒకరు.

దేవయాని:

నటి దేవయాని రాజ్ కుమార్ అనే డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దేవయాని తల్లిదండ్రులు వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. రహస్యంగా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.

రమ్యకృష్ణ:

హీరోయిన్ రమ్యకృష్ణ కూడా దర్శకుడుని పెళ్లి చేసుకున్నారు దర్శకుడు కృష్ణవంశీని ఈమె ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది.

You may also like

Leave a Comment