Telugu News » Himachal Pradesh: కోర్టుకెక్కిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు..!

Himachal Pradesh: కోర్టుకెక్కిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు..!

హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.  స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించడంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వేసిన పిటిషన్ వేశారు.

by Mano
KTR: Conspiracy to sink the project completely.. KTR's sensational comments..!

హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh)లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)లపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు విధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథానియా వారి ఎమ్మెల్యేల సభ్యత్వాల నుంచి తొలగించారు.

KTR: Conspiracy to sink the project completely.. KTR's sensational comments..!

శాసనసభలో ఆర్థిక బిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో  స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వేసిన పిటిషన్ వేశారు.

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్పాల్, చైతన్య శర్మ, దేవిందర్ కుమార్ భుట్టో క్రాస్ ఓటింగ్ వేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బీజేపీ పార్టీ అభ్యర్థికి సరిసమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేయగా బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. ఈ అనర్హత వేటు వలన హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ బలం 40 నుంచి 34కి తగ్గింది. ప్రతిపక్ష బీజేపీకి ఇప్పుడు 25 సీట్లు వచ్చాయి.

You may also like

Leave a Comment