Telugu News » Telangana : తెలంగాణలో మొదలైన ఉచిత విద్యుత్ బిల్లుల జారీ.. వీరికి మాత్రమే..?

Telangana : తెలంగాణలో మొదలైన ఉచిత విద్యుత్ బిల్లుల జారీ.. వీరికి మాత్రమే..?

ప్రజాపాలన సభల ద్వారా దరఖాస్తు చేసుకొన్న అర్హులకు ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి నెలకు 200 యూనిట్లు వినియోగించే గృహ విద్యుత్ కనెక్షన్లకు ఈ ఉచిత విద్యుత్ వర్తింపజేస్తున్నారు.

by Venu

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.. ఈ క్రమంలో గృహజ్యోతి స్కీమ్ (Grihajyoti Scheme) కింద జీరో బిల్లుల జారీ రాష్ట్ర వ్యాప్తంగా మ్ముమ్మరంగా కొనసాగుతుంది. విద్యుత్ సిబ్బంది నేటి ఉదయం 6 గంటల నుంచే ఆయా ప్రాంతాల్లో వినియోగదారులకు జీరో బిల్లులు (Zero bills) అందజేస్తున్నారు.

ప్రజాపాలన సభల ద్వారా దరఖాస్తు చేసుకొన్న అర్హులకు ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి నెలకు 200 యూనిట్లు వినియోగించే గృహ విద్యుత్ కనెక్షన్లకు ఈ ఉచిత విద్యుత్ వర్తింపజేస్తున్నారు. గత నెలలో విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లుల స్థానంలో జీరో బిల్లులు అందజేస్తున్నారు. జీరో బిల్లులో వినియోగించిన విద్యుత్ కు ఎంత ఛార్జీ అయిందో పేర్కొంటున్నారు.

అనంతరం ఆ మొత్తాన్ని గృహజ్యోతి సబ్సిడీ కింద మైనస్ గా చూపిస్తూ నెట్ బిల్ అమౌంట్ జీరోగా చూపిస్తున్నారు. ఇక ఈ స్కీమ్ కు అర్హతలు ఉండి లబ్ది పొందలేని వారికి విద్యుత్ సిబ్బంది తగిన సూచనలు చేస్తున్నారు. గృహజ్యోతి పథకం నిరంతర ప్రక్రియ అని అర్హులైన వారు మండల కార్యాలయాలల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు ఈ స్కీమ్ ను, ఫిబ్రవరి నెల 27న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. మార్చి ఒకటో తేదీ.. అంటే నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్.. రూ. 500 గ్యాస్ పథకాన్ని సైతం ప్రారంభించింది. తాజాగా ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేయడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment