Telugu News » Himachal Pradesh: భారీ వర్షాలు.. విద్యా సంస్థల బంద్..!

Himachal Pradesh: భారీ వర్షాలు.. విద్యా సంస్థల బంద్..!

సిమ్లాతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం, హిమపాతంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు, హిమపాతం కారణంగా హిమాచల్‌ ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి.

by Mano
Himachal Pradesh: Heavy rains.. Shutdown of educational institutions..!

హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో భారీ హిమపాతం, వర్షాల కారణంగా రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించారు. నాలుగు జాతీయ రహదారులతో సహా 350 రహదారులను అధికారులు మూసివేశారు. దీంతోపాటు అన్ని విద్యాసంస్థలను మూసివేశారు.

Himachal Pradesh: Heavy rains.. Shutdown of educational institutions..!

సిమ్లాతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం, హిమపాతంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు, హిమపాతం కారణంగా హిమాచల్‌ ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. మార్చి 3వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

తోపాటు కులు జిల్లాలో భారీగా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కులు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను శనివారం మూసివేశారు. వార్షిక పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. మిగిలిన విద్యాసంస్థలు శనివారం పూర్తిగా మూసివేశారు.

భారీగా మంచు కురుస్తుండటంతో జిల్లాలో ట్రాఫిక్‌ స్తంభించింది. అదే సమయంలో పలు రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పర్యాటకుల కోసం అటల్ టన్నెల్ కూడా మూసివేశారు. హిమపాతం కారణంగా సోలాంగ్ నాలాలోని రోడ్లు కూడా మూసుకుపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ వ్యవస్థ స్తంభించింది.

You may also like

Leave a Comment