Telugu News » Donald Trump: ట్రంప్ జోరు.. మరో మూడు రాష్ట్రాల్లో నిక్కీ హేలీ ఓటమి..!

Donald Trump: ట్రంప్ జోరు.. మరో మూడు రాష్ట్రాల్లో నిక్కీ హేలీ ఓటమి..!

అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ విజయాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల నిక్కీ హేలీ(nikki haley)ని సొంత స్థానంలో ఓడించిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం మరో మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి నిక్కీ హేలిని సులభంగా ఓడించారు.

by Mano
Donald Trump: Trump's strength.. Nikki Haley's defeat in three more states..!

అమెరికా(america) అధ్యక్ష ఎన్నికల నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్(donald Trump) ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ విజయాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల నిక్కీ హేలీ(nikki haley)ని సొంత స్థానంలో ఓడించిన సంగతి తెలిసిందే.

Donald Trump: Trump's strength.. Nikki Haley's defeat in three more states..!

రిపబ్లికన్ పార్టీ(Republican) తరఫున డొనాల్డ్ ట్రంప్ తాజాగా శనివారం మరో మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి నిక్కీ హేలిని సులభంగా ఓడించారు. వాటిలో మిచిగాన్(Michigan), ఇడాహో(Idaho), మిస్సౌరీ(Missouri) రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ దాదాపు 98% అంటే 1575 ఓట్లతో గెలుపొందగా, నిక్కీ హేలీకి కేవలం 36 ఓట్లు మాత్రమే వచ్చాయి.

స్టేట్ రిపబ్లికన్ పార్టీప్రకారం ట్రంప్ మిచిగాన్‌లో నామినేషన్ కౌకస్‌లో పాల్గొన్నారు. మిచిగాన్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఛైర్మన్ పీట్ హోయెక్స్ట్రా దీనిని ‘అద్భుతమైన, ఆకట్టుకునే’ విజయమని పేర్కొన్నారు. ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, మిచిగాన్, మిస్సౌరీ, ఇడాహోలో విజయాలతో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్నారు.

దీంతో ప్రెసిడెంట్ నామినేషన్ రేసులో నిక్కీ హేలీకి వెనుకబడిపోయిందని చెప్పవచ్చు. తన మద్దతును కూడగట్టుకోవడంలో ఆమె విఫలమవుతున్నారు. ఈ క్రమంలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ జో బైడెన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుత ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రజాదరణ క్రమంగా క్షీణిస్తున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది.

 

You may also like

Leave a Comment