Telugu News » Housing Crisis: సంక్షోభంలో కెనడా.. భారతీయ విద్యార్థులకు బిగ్‌షాక్..!

Housing Crisis: సంక్షోభంలో కెనడా.. భారతీయ విద్యార్థులకు బిగ్‌షాక్..!

కెనడాకు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థుల్లో ఇండియా నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. అక్కడ ప్రజలు ఇళ్లు దొరక్క అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

by Mano
Housing Crisis: Canada in crisis.. Big shock for Indian students..!

కెనడా(Canada)లో పెరుగుతున్న నిరుద్యోగం, గృహ సంక్షోభంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడ గృహ సంక్షోభం(Housing Crisis) తారాస్థాయికి చేరుకుంది. అక్కడ ప్రజలు ఇళ్లు దొరక్క అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Housing Crisis: Canada in crisis.. Big shock for Indian students..!

కెనడాకు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థుల్లో ఇండియా నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే గృహ సంక్షోభం నేపథ్యంలో కెనడా విదేశీ విద్యార్థులపై పరిమితి విధిస్తే ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ ఏడాది 4లక్షల 85వేల మంది వలసదారులను, 2025, 2026లో 5లక్షల మంది వలసదారుల్ని కెనడాకు ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కెనడాలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ శనివారం ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఎంతమేర పరిమితి విధిస్తారనే వివరాలను మంత్రి పేర్కొనలేదు. ఫెడరల్ ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలతో చర్చించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను కలవరపరిచేలా ఉందన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మొదటి,  రెండవ త్రైమాసికాల్లో గృహాల డిమాండ్‌ను తగ్గించడంలో సహాయపడటానికి అంతర్జాతీయ విద్యార్థులపై పరిమితిని నిర్ణయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మిల్లర్ తెలిపారు. అయితే ఇదే హౌసింగ్ సంక్షోభానికి ఏకైక పరిష్కారం కాదని వెల్లడించారు.

You may also like

Leave a Comment