Telugu News » Houthi Attacks In Red Sea: తగ్గని హౌతీ రెబల్స్.. అమెరికా, ఇరాన్ భీకర దాడులు..!

Houthi Attacks In Red Sea: తగ్గని హౌతీ రెబల్స్.. అమెరికా, ఇరాన్ భీకర దాడులు..!

అమెరికా నౌకపైకి హౌతీ రెబల్స్(Houthi Rebels) క్షిపణిని ప్రయోగించారు. మరోవైపు ఇరాక్‌పై ఇరాన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. హౌతీల తాజా దాడి ఎర్రసముద్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది.

by Mano
Houthi Attacks In Red Sea: Unabated Houthi Rebels.. America, Iran Fierce Attacks..!

ఎర్రసముద్రం(Red Sea) లో ఉద్రిక్తతలు ఆగడంలేదు. అమెరికా నౌకపైకి హౌతీ రెబల్స్(Houthi Rebels) క్షిపణిని ప్రయోగించారు. మరోవైపు ఇరాక్‌పై ఇరాన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది.  అమెరికా, బ్రిటన్ ఇతర మిత్రదేశాలు కలిసి యెమెన్​లోని హౌతీ రెబల్స్ స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేస్తున్నాయి. అయినా మిలిటెంట్లు వెనక్కి తగ్గడం లేదు.

Houthi Attacks In Red Sea: Unabated Houthi Rebels.. America, Iran Fierce Attacks..!

ఎర్రసముద్రంలో అమెరికా యుద్ధ నౌకపైకి యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసి 24 గంటలు గడవకముందే ఈ దాడి చేయడం గమనార్హం. యెమెన్​లోని ఓడరేవు వైపు నుంచే మిస్సైల్ దూసుకొచ్చిందని షిప్ కెప్టెన్ నివేదించినట్లు తెలిపింది. ఆడెన్​కు ఆగ్నేయ దిశలో 110 మైళ్ల దూరంలో దాడి జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ వెల్లడించింది.

హౌతీల తాజా దాడి ఎర్రసముద్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. హౌతీ రెబల్స్ దాడిని అమెరికా సైన్యం నిర్ధారించింది. ఓడకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ప్రస్తుతం అది దాని ప్రయాణాన్ని కొనసాగిస్తోందని తెలిపింది. బాధ్యత వహిస్తూ హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ప్రకటన విడుదల చేశారు. తమ దేశంపై దురాక్రమణకు దూసుకొస్తున్న అమెరికన్, బ్రిటిష్ సాయుధ బలగాలు శత్రు లక్ష్యాలుగా పరిగణిస్తాయని హెచ్చరించారు.

మరోవైపు, అర్ధరాత్రి ఇరాక్‌ ఎర్బిల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఇరాన్‌ సైన్యం వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు ఇరాక్‌ సైనికులు మృతి చెందారు. అయితే సంకీర్ణ దళాలకు చెందిన సేనలకు, అమెరికన్ సైనికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇరాక్‌ సైన్యం తెలిపింది. దాడి జరిగిన వెంటనే ప్రతిస్పందించిన సంకీర్ణ సేనలు 3 డ్రోన్లను నేలమట్టం చేశాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎర్బిల్‌లో విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

You may also like

Leave a Comment